📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

News Telugu: Mumbai Crime: మసాజ్ మాయ.. పాముతో భార్య ప్రాణాలు తీసిన భర్త

Author Icon By Rajitha
Updated: December 15, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. భార్యకు మసాజ్ చేస్తానని నమ్మించి, విషసర్పంతో కాటు (snake bite) వేయించి హత్య చేసిన భర్త నిర్వాకం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ముంబై సమీపంలోని బడ్లాపూర్‌లో 2022లో జరిగిన ఈ ఘటనను అప్పట్లో సహజ మరణంగా భావించారు. కానీ మూడేళ్ల తర్వాత జరిగిన లోతైన విచారణలో ఇది పక్కా ప్రణాళికతో చేసిన కుట్రపూరిత హత్య అని తేలింది. మృతి చెందిన మహిళ స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత నీర్జా ఆంబేకర్ కావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.

Read also: TG Crime: రోడ్డు ప్రమాదం లో వైద్య విద్యార్థిని మృతి

Mumbai Crime

పాముతో మూడు సార్లు బలవంతంగా కాటు

పోలీసుల వివరాల ప్రకారం, నీర్జా భర్త రూపేశ్ ఆంబేకర్ ముందుగానే తన సహచరులతో కలిసి ఈ హత్యకు స్కెచ్ వేశాడు. సహజ మరణంగా కనిపించేలా చేయడానికి విషసర్పాన్ని ఆయుధంగా ఎంచుకున్నారు. ఒక రోజు మసాజ్ చేస్తానని భార్యను హాల్‌లో పడుకోబెట్టిన రూపేశ్, వంటగదిలో దాచి ఉంచిన పామును బయటకు తెప్పించాడు. అనంతరం నీర్జా ఎడమ కాలి మడమ వద్ద పాముతో మూడు సార్లు బలవంతంగా కాటు వేయించారు. పోస్టుమార్టం జరగకపోవడంతో, అప్పట్లో పోలీసులు ఇది పాము కాటు వల్ల జరిగిన ఆకస్మిక మరణంగానే నమోదు చేసి కేసును మూసివేశారు.

అయితే, ఇటీవల మరో కేసు విచారణలో నిందితుడు ఇచ్చిన కీలక సమాచారం ఈ హత్య రహస్యాన్ని బట్టబయలు చేసింది. గత ఆరు నెలలుగా జరిగిన లోతైన దర్యాప్తులో భర్త రూపేశ్‌తో పాటు అతడి ముగ్గురు సహచరుల పాత్ర స్పష్టమైంది. దీంతో పోలీసులు అందరినీ అరెస్టు చేసి, ఇది సహజ మరణం కాదని, అత్యంత క్రూరంగా అమలు చేసిన హత్య అని నిర్ధారించారు. ఈ కేసు నమ్మకం, మోసం, క్రూరత్వం ఎలా ప్రాణాంతకంగా మారుతాయో చూపించే భయానక ఉదాహరణగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Badlapur latest news Mumbai crime Snakebite murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.