📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Cm Yogi : 8 ఏళ్లలో 14,000కు పైగా ఎన్‌కౌంటర్లు! డేటా రిలీజ్‌ చేసిన యోగి సర్కార్

Author Icon By Shobha Rani
Updated: June 20, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2017లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ (Cm Yogi) ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అంతటా పోలీసు ఎన్‌కౌంటర్లలో గణనీయమైన పెరుగుదల ఉందని ఇటీవలి డేటా వెల్లడిస్తోంది. ఈ ఆపరేషన్లలో అనేక మంది నేరస్థులు హతమయ్యారు. అలాగే వేల సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అయితే తాజాగా మొట్ట మొదటిసారి ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర నేర నిరోధక కార్యకలాపాలపై సమగ్ర డేటాను విడుదల చేశారు.
అధికారిక గణాంకాలు ప్రకారం
యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రాజీవ్ కృష్ణ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2017 నుంచి 2024 మధ్య పోలీసు ఎన్‌కౌంటర్లలో మొత్తం 234 మంది కరడుగట్టిన నేరస్థులు హతమయ్యారు. అదనంగా ఈ ఘర్షణల్లో 9,202 మంది నేరస్థులు గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేసింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్ అంతటా 14,741 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి.
అరెస్టైన నేరస్థులు
ఈ ఆపరేషన్లలో 30,293 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. అయితే ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్స్‌ సమయంలో పోలీసులు కూడా మరణించారు. విధి నిర్వహణలో నేరస్థులతో పోరాడుతున్నప్పుడు 18 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1,700 మంది పోలీసులు గాయపడ్డారు.
అత్యధిక ఎన్‌కౌంటర్లు – మీరట్ జోన్ ముందుండి
డేటా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మీరట్ జోన్‌లో అత్యధికంగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. మొత్తం 4,183 ఆపరేషన్లలో 7,871 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు. 2,839 మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 77 మంది భయంకరమైన నేరస్థులు మరణించారు. అలాగే ఇద్దరు పోలీసులు వీరమరణం పొందగా, 452 మంది గాయపడ్డారు. వారణాసిలో1,041 ఎన్‌కౌంటర్‌లలో 2,009 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 605 మంది

Cm Yogi : 8 ఏళ్లలో 14,000కు పైగా ఎన్‌కౌంటర్లు! డేటా రిలీజ్‌ చేసిన యోగి సర్కార్

గాయపడ్డారు, 26 మంది మరణించారు. 96 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. అలాగే ఆగ్రా జోన్‌లో 2,288 ఎన్‌కౌంటర్ సంఘటనలు జరిగాయి. దీని ఫలితంగా 5,496 మంది నేరస్థులు అరెస్టు అయ్యారు, 715 మంది గాయపడ్డారు. 19 మంది మరణించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో 56 మంది పోలీసులు కూడా గాయపడ్డారు.
నేరాలపై కఠినమైన పోరాటం – విమర్శలూ, ప్రశంసలూ
పోలీసులు కఠినంగా వ్యవహరించటం వల్ల నేరాల నియంత్రణకు ఉపయోగపడిందని వాదన. అదే సమయంలో, మానవ హక్కుల సంస్థలు ఫేక్ ఎన్‌కౌంటర్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ డేటా వాస్తవాలను చూపించినా, దాని నేపథ్యం మరియు న్యాయబద్ధతపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.

Read Also: Israel-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్

000 encounters 8 years! Breaking News in Telugu Encounters Google news Google News in Telugu Latest News in Telugu More than 14 Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news UPCrime UPPolice YogiAdityanath ZeroTolerance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.