Moradabad Crime: సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

Read Time:  1 min
Moradabad Crime: సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?
FONT SIZE
GET APP

Moradabad Crime: ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక యువకుడు, ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో అతని కవల సోదరి (Twin Sister) అతడిని మందలించింది. తన తీరు మార్చుకోవాలని, బాధ్యతగా ఉండాలని చెప్పింది. ఈ చిన్న మాటను తట్టుకోలేకపోయిన ఆ యువకుడు, కోపంతో ఊగిపోయి సోదరి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశాడు.

Read Also: CP Sajjanar: గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గత ఏడాదిన్నరగా మారిన ప్రవర్తన

మొరాదాబాద్‌కు చెందిన హార్దిక్, హిమశిఖలు కవల పిల్లలు (25). ఇద్దరూ విద్యావంతులే, ఇంజనీర్లుగా గుర్గావ్‌లో మంచి కెరీర్‌ను ప్రారంభించారు. అయితే, ఏడాదిన్నర క్రితం హార్దిక్ తన ఉద్యోగాన్ని వదిలేయడంతో అసలు సమస్య మొదలైంది. ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాకు బానిసైన హార్దిక్‌కు, పూణేకు చెందిన ఒక మహిళతో ఆన్‌లైన్ పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పట్టాడు.

మార్చి 6: ఆ సాయంత్రం ఏం జరిగింది?

స్థిరమైన ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవద్దని, కెరీర్ మీద దృష్టి పెట్టాలని సోదరి హిమశిఖ అతడికి తరచూ నచ్చజెప్పేది. మార్చి 6వ తేదీ సాయంత్రం కూడా వారిద్దరి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం జరిగింది. తన ప్రేమకు అడ్డు పడుతోందని, తనను తక్కువ చేసి మాట్లాడుతోందని భావించిన హార్దిక్‌లో ఉన్మాదం మేల్కొంది. వంటింట్లోని కత్తిని తీసుకుని హిమశిఖపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ప్రాణాలు పోయినా వదలకుండా ఏకంగా 84 సార్లు కత్తితో పొడిచి తన కసి తీర్చుకున్నాడు.

Moradabad Crime: The brother who stabbed his sister to death.. Do you know what he did after that?
Moradabad Crime: The brother who stabbed his sister to death.. Do you know what he did after that?

తల్లికి భయంకరమైన ‘సర్‌ప్రైజ్’

హత్య చేసిన తర్వాత హార్దిక్ ఏమాత్రం భయం లేకుండా తన తల్లి నీలిమ పని చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లాడు. “అమ్మా.. నీకోసం ఇంట్లో ఒక సర్ ప్రైజ్ ఉంది, వెంటనే పదా” అని నమ్మించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. గడప దాటి లోపలికి వెళ్లిన నీలిమకు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న కూతురు కనిపించింది. ఆ షాక్‌లో ఆమె కేకలు వేయగా, హార్దిక్ ఆమెను కూడా చంపడానికి దాడికి దిగాడు. అదృష్టవశాత్తూ స్థానికులు సకాలంలో స్పందించి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో నీలిమ ప్రాణాలతో బయటపడింది.

తల్లికి ప్రాణాపాయం తప్పింది.. కానీ తీరని శోకం

అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసి నీలిమను ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డప్పటికీ.. కన్నకొడుకే, సొంత సోదరిని చంపడం చూసి గుండెలవిసేలా రోదిస్తోంది. మరోవైపు స్థానికులు తల్లిని కొట్టొద్దంటూ ఆపగానే హార్దిక్ పారిపోయాడు. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు హార్దిక్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తన కెరీర్ గురించి, ప్రేమ గురించి ఇంట్లో వారు పదే పదే సలహాలు ఇస్తుండటంతో తనలో అసహనం పెరిగిపోయిందని.. అందుకే ఈ పని చేశానని పోలీసులకు వెల్లడించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.