📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Moinabad Drugs Party Raid: పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు

Author Icon By Tejaswini Y
Updated: March 16, 2026 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Moinabad Drugs Party Raid: నగర శివార్లలోని మొయినాబాద్ అజీజ్ నగర్ లో గల మాజీ ఎంఎల్ఎ పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఈగల్, ఫోర్త్ సిటీ పోలీసులు గుట్టురట్టు చేయడం వెనుక భారీ ఆపరేషన్ కొనసాగింది. ఈ పార్టీలో ప్రముఖులు వున్నట్లు, ఇందులో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ పోలీసులు దీనిపై స్థానిక పోలీసుల సహకారంతో శనివారం రాత్రి పది గంటల సమయంలో దాడులు చేయడం తెలిసిందే. దాడి చేసేముందు పోలీసులు ఫాం హౌస్ లోకి వెళ్లి స్పీకర్లతో తాము పోలీసులమని హెచ్చరించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు తమకు సమాచారం వుందని, తాము సోదాలు చేయడానికి వచ్చామని, తమకు సహకరించాలని కోరారు.

Read Also: NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

Moinabad Drugs Party Raid: Drug party busted at Pilot Rohit Reddy’s farmhouse

ఈ సమయంలో పార్టీలో వున్న ఓ వ్యక్తి నాలుగు రౌండ్లు పోలీసులను బెదిరిస్తూ గాలిలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి స్పీకర్లలో హెచ్చరించారు. పోలీసులపై కాల్పులు జరిపితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించడంతో పాటు పార్టీ జరుగుతున్న భవనంలోకి బలవంతంగా ప్రవేశించారు. ఈ సమయంలో అక్కడ ఒక మహిళతోపాటు 11 మంది వున్నారు. వీరంతా మద్యం మత్తులో వుండగా కొందరు డ్రగ్స్ సేవించినట్లు అనుమానాలు వుండడంతో అందరికి డ్రగ్స్ పరీక్షలు జరిపారు. ఇదే సమయంలో వాష్ రూం వద్ద చేతిలో ఎ32 కాలిబర్ రివాల్వరన్ను పట్టుకుని వుండగా అతన్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు నమిత్ శర్మగా తేలింది. ఇతని చేతిలో వున్న రివాల్వర్ జర్మనీలో తయారైనట్లు తేలింది. ఇతనికి సమీపం లో మరో వ్యక్తి ఖాళీ తూటా పట్టుకుని వుండగా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని సిల్వేరి శరత్కుమార్గా గుర్తించారు. ఇతని వద్ద 26 గ్రాముల కొకైన్, భారీగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

పోలీసులపై కాల్పులు

రివాల్వర్ పట్టుకున్న నమిత్ శర్మ పోలీసులపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ రివాల్వర్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా తేలింది. ఘటనా స్థలంలో తూటాతో పాటు మొత్తం 4 ఖాళీ తూటాలు లభ్యమయ్యాయి. రివాల్వర్ తోపాటు తూటాను, ఖాళీ తూటాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పరీక్షల నిమి త్తం పంపారు. కాగా ఈ ఆపరేషన్పై ఈగల్ డైరక్టర్ సందీప్ శాండిల్యా ఆదివారం నాడు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, రోహిత్ రెడ్డి ఫాం హౌస్పై జరిగిన దాడికూడా పక్కా సమాచారం తోనే జరిగిందని ఆయన తెలిపారు. డ్రగ్స్ కు సంబం ధించి ఎవరి వద్ద ఎలాంటి సమాచారం వున్నా 1908 లేదా 8712671111కు వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. సమా చారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా వుంచుతామని ఆయన వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Drugs Raid Hyderabad Eagle Police Raid Moinabad Drugs Party Moinabad Drugs Party Raid Namith Sharma Pilot Rohit Reddy Farmhouse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.