📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Putta Mahesh Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి పాజిటివ్ రాగా, ఇప్పుడు ఎంపీ పేరు కూడా ఈ జాబితాలో చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

మెటబాలిజం వల్లే రిపోర్టులో వ్యత్యాసం : ఎస్పీ వెల్లడి

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన కీలక వివరాలను రంగారెడ్డి ఎస్పీ గిరిధర్ మీడియాకు వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. శనివారం (మార్చి 14) నిర్వహించిన టెస్ట్‌లో పుట్టా మహేష్‌కు నెగెటివ్‌ వచ్చింది. అయితే ఇవాళ నిర్వహించిన టెస్ట్‌లో ఎంపీకి డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిందని ఈగల్‌ ఎస్పీ తెలిపారు. శరీర మెటబాలిజమ్‌ బట్టి రిపోర్టులో వ్యత్యాసం ఉందని ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌ వెల్లడించారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్‌ తీసుకుంటే చర్యలు తప్పవని ఎస్పీ గిరిధర్‌ హెచ్చరించారు.

తాండూరు పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న వారిలో 11 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు చేసినట్లు ఈగల్ టీమ్ పోలీసులు తెలిపారు. శరీర మెటబాలిజమ్‌ బట్టి రిపోర్టులో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్‌ పార్టీపై మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌‌లో FIR నమోదు అయ్యింది. కౌశిక్‌ రవి అనే వ్యక్తి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బెంగళూరుకు చెందిన కౌశిక్‌ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. గతంలో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Drugs Case Telangana Eluru MP Putta Mahesh Kumar Moinabad Farmhouse Case Pilot Rohit Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.