📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Mohammad Azharuddin: మహ్మద్ అజారుద్దీన్‌ ఇంట్లో భారీ చోరీ..

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) కుటుంబంలో చోరీ ఘటన కలకలం రేపింది.లోనావాలాలోని విలాసవంతమైన బంగ్లాలో దొంగతనం జరిగింది.దొంగలు బంగ్లాలో కొన్ని విలువైన వస్తువులు చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జులై 7 నుంచి 18 మధ్య బంగ్లా ఖాళీగా ఉన్నప్పుడు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. పుణె పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, దొంగలు బంగ్లా వెనుక గోడకు ఉన్న జాలిని కోసి లోపలికి ప్రవేశించారు. దొంగలు ముందుగా మొదటి అంతస్తులోని గ్యాలరీకి ఎక్కి, ఆ తర్వాత కిటికీ గ్రిల్‌ (Grill) ను బలవంతంగా తెరిచి లోపలికి చొరబడ్డారు. ఈ ఘటనలో దొంగలు రూ.50 వేల నగదు, దాదాపు రూ.7వేల విలువైన టీవీని దొంగిలించారు. మొత్తంగా దొంగలు దాదాపు రూ. 57,000 వరకు నష్టం కలిగించారు.

Mohammad Azharuddin: మహ్మద్ అజారుద్దీన్‌ ఇంట్లో భారీ చోరీ..

గ్రామీణ పోలీసులు

అంతే కాకుండా, దొంగలు ఇంటి లోపల ఉన్న వస్తువులకు కూడా నష్టం కలిగించినట్లు తెలుస్తోంది.బంగ్లాలో జరిగిన చోరీపై అజారుద్దీన్‌కు సన్నిహితుడైన మహ్మద్ ముజీబ్ ఖాన్ (Muhammad Mujeeb Khan) ఫిర్యాదు చేశారు. ముజీబ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాలో ఎవరూ లేని సమయంలో అంటే జులై 7 నుంచి 18 మధ్య చోరీ జరిగింది. లోనావాలా గ్రామీణ పోలీసులు అజ్ఞాత వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్లు 331(3), 331(4), 305(A), 324(4), 324(5) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) లను పరిశీలించి పోలీసులు నేరస్థులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనితో పాటు చుట్టుపక్కల ప్రజలను కూడా విచారిస్తున్నారు.

మహ్మద్ అజారుద్దీన్ ఎవరు?

మహ్మద్ అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతను స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచారు. 1984 నుండి 2000 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అజారుద్దీన్ ఎక్కడ జన్మించారు?

మహ్మద్ అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sujeet Kalkal: రెజ్లింగ్ లో సుజీత్ కల్కల్ కు స్వర్ణ పతకం

2025 Lonavala burglary Azharuddin family news Breaking News latest news Lonavala robbery case Mohammad Azharuddin house robbery Pune rural police FIR Sangeeta Bijlani bungalow theft Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.