మైనర్ బాలికను బలవంతంగా అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా పోక్సో కోర్ట్ జడ్జ్ వేల్పుల భవాని విధించారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో కొండపల్లి ఏరియాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపై పోక్సో చట్టపరిధిలో కేసును నమోదు చేసారు. ఈ కేసు విచారణలో నిందితుడు కాండ్ర కొండ ఆంథోని (37) ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో ఏ.సి.పి. హనుమంతరావు హాజరు పరిచారు. పోక్సో కోర్టు ఈ కేసును విచారించి నిందితునికి శిక్షను ఖరారు చేసింది.
Read also: Breaking news: Tirupati Fire Accident: తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Vijayawada Crime: Minor Girl Rape Case — Accused Sentenced to 20 Years in Prison
మరో కేసులో 10 ఏళ్ల శిక్ష
ఇదిలా ఉండగా… బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు సంవత్సరాల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శైలజ 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు బిట్ల అలియాస్ పిట్ల సూరిబాబు (45) కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక డాబా ఇంటి లోనికి తీసుకొని వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపగా, బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ ఎస్ ఐ చంద్ర శేఖర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సదరు కేసు ఒంగోలు పోక్సో కోర్టులో విచారణకు రాగా సాక్షులు నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చి సమయానికి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహించి, సమర్థవంతంగా ట్రయల్ నిర్వహించి నిందితుడికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: