నల్లగొండ(Nalgonda)లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ (Rape) చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే టాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గుట్ట కింద అన్నారంకు చెందిన గడ్డం కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆరు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

Heart Attack : భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త ..కారణం అదే..!!
బాలికపై లైంగిక దాడి
అయితే ఇదే చనువుతో కళాశాలకు వెళ్తున్న ప్రయేసిని సోమవారం ఉదయం 8:30కి స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు కృష్ణ. శమ్స్‌నగర్ రోడ్ నెం.8 వద్ద వాటర్ ట్యాంక్ పక్కనే కిరాయి గదిలో ఉదయం 9 గంటలకు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరిమధ్య వివాదం చోటుచేసుకోగా బాలికను అక్కడే చంపేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన DSP శివరాం రెడ్డి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేక ఇంకెవరైనా సహాయం చేశారా అనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఎందుకు అత్యాచారం కేసులు పెరిగిపోతున్నాయి?
అత్యాచార కేసులు పెరిగినప్పటికీ, అనేక సంఘటనలు నివేదించబడలేదు లేదా వారి ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు, తరచుగా కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే ఆందోళనల నుండి ఉత్పన్నమవుతాయి. చట్ట అమలు సంస్థలు న్యాయమైన విచారణను అందించకపోవచ్చు కాబట్టి, అత్యాచార కేసులకు న్యాయం పొందడంలో చాలా మంది మహిళలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/