हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Medipalli crime: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది..

Tejaswini Y
Medipalli crime: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది..

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తని ప్రియుడు, ప్రియుడు స్నేహితుడితో కలిసి గొంతుకోసి హత్య చేసిన ఘటన మేడిపల్లి(Medipalli crime) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… తూర్పు బృందావన్ కాలనీ బోడుప్పల్ లో వి జె అశోక్ (45) తన భార్య పూర్ణిమ (36), కొడుకుతో నివాసం ఉంటున్నారు. అశోక్ శ్రీనిధి విశ్వవిద్యాలయంలో లాజిస్టిక్ మేనేజర్(Logistic Manager) గా, భార్య పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

Read Also: HYD Crime: హైడ్రా కమిషనర్ రంగనాథ్, గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం?

భార్యసహా ముగ్గురు నిందితుల అరెస్ట్

తన భార్య ఏ1 పూర్ణిమ, గతంలో అదే కాలనీలో నివాసం ఉన్న ప్రియుడు భవన నిర్మాణ కార్మికుడు ఏ2 పాలేటి మహేష్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త తన భార్యను ప్రశ్నించడం వేధించడం ప్రారంభించాడు. దీని కారణంగా తన భార్య ప్రియుడుతో కలిసి భర్తను అంతమొందించడానికి కుట్రపన్నారు(Conspiracy). ప్రియుడి స్నేహితుడైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఏ3 భూక్య సాయికుమార్ (22) సహాయంతో ఈనెల 11న తన భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ పూర్ణిమ సాయి కుమార్ అతని పట్టుకుని దాడి చేయగా భార్య అతని కాళ్లు పట్టుకుంది.

wife killed husband Hyderabad
Medipalli crime: The husband who was obsessed with his lover was killed..

గుండెపోటు డ్రామా… చివరకు బయటపడ్డ భర్త హత్య నిజం

మహేష్ మూడు చున్నీలతో మృతుడిని గొంతు కోసి హత్య చేశారు. హత్య తర్వాత నిందితుడు మృతుడి బట్టలు మార్చాడు. సాక్షాలు లేకుండా చేయడానికి వస్తువులను పడేశాడు. తన భర్త గుండెపోటు వల్ల మరణించాడని బంధువులను తప్పుదారి పట్టించింది. తన భర్త ఇంటి వాష్రూమ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని మల్కాజిరి ప్రభుత్వాసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట్లో ఎలాంటి అనుమానం కలుగలేదు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహంపై అనుమానాస్పద గాయాలు కనిపించడం, చెంప, మెడపై గాయాలు కూడా ఉండడంతో మరణం పై కొంత అనుమానం రావడంతో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు ఆపిల్ ఫోన్ (ఏ2), రక్తంతో తడిసిన మూడు చున్నీలు, మరకలున్న చొక్కా బనియన్, మరణించిన వ్యక్తి యొక్క విరిగిన పళ్ళు, నేరా రూపణ చేసే ఫోటోలు, వీడియోలు ఉన్న ఒక పెన్ డ్రైవ్, ఫ్యాషన్ ప్రో 2 వీలర్ బైక్ (ఏ3), రక్తపు మరకలు ఉన్న ప్యాంటు చొక్కా (ఏ3) ఆధారాలతో ఏ1 తన భార్య పూర్ణిమ.

ఏ2 పాలేటి మహేష్, ఏ3 భూక్య సాయికుమార్ నిందితులుగా గుర్తించారు. కేసును సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ 103(1), 238 ఆర్/డబ్ల్యూ 3(5) బిఎన్ఎస్ కు మార్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు(G Sudheer Babu) నాయకత్వంలో మల్కాజిగిరి జోన్ డిసిపి సిహెచ్ శ్రీధర్, మల్కాజిరి ఏసిపి ఎస్ చక్రపాణి, ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును గుర్తించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు నర్సింగ రావు, ఉదయ భాస్కర్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870