TG: మేడ్చల్ జిల్లా(Medchal crime)లోని గౌడవెల్లి గ్రామంలో మంగళవారం రాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో మొదలైన వివాదం చివరికి ఒక వ్యక్తి మృతి(Died) చెందడానికి కారణమైంది. స్థానికుడు గోమారం లక్ష్మారెడ్డి (42) తన ఇంట్లో అద్దెకు ఉంటున్న గొర్రెల కాపరి మలిగ లింగం (50)తో కలిసి మద్యం సేవించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య మాటల తూటాలు తీవ్రమయ్యాయి.
Read Also: Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత
సమాచారం అందుకున్న పోలీసులు
వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఆవేశానికి గురైన లింగం గొడ్డలితో లక్ష్మారెడ్డి తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మారెడ్డి ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: