Medaram Road Accident: భక్తుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

Read Time:  1 min
Medaram Road Accident
Medaram Road Accident
FONT SIZE
GET APP

Medaram Road Accident: ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో నిర్వహించే ‘తిరుగువారం’ పండుగకు వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. భక్తులతో ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది.

Read also: Accident : జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Medaram Road Accident
Medaram Road Accident

ప్రమాద వివరాలు:

ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల వివరాలు గాయపడిన వారంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Kothagudem District) చర్ల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతివేగం లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read Also:

    Tejaswini Y

    రచయిత గురించి

    Tejaswini Y

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.