📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Medak Crime: పని ఇస్తామని నమ్మించి మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆపై అత్యాచారం

Author Icon By Aanusha
Updated: October 12, 2025 • 9:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ నిరుపేద మహిళ, కామాంధుల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పని ఇస్తామని నమ్మించి ఆ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ అమానుష ఘటన గురించి తెలిసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు.

Pooran Kumar: ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. రేవంత్ రెడ్డి స్పందన

బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జానకంపల్లి (Janakampally) పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన మహిళ శుక్రవారం ఉదయం కూలి పని కోసం మెదక్‌కు వచ్చింది. అక్కడి కూలీల అడ్డాలో పని కోసం ఎదురుచూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంప్రదించారు.

పని ఉందని నమ్మబలికి, కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులోని ఏడుపాయల వెళ్లే మార్గంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడి (Rape) కి పాల్పడటమే కాకుండా, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి, రెండు చేతులను ఓ స్తంభానికి కట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Medak Crime

అపస్మారక స్థితిలో స్తంభానికి కట్టేసి

రాత్రంతా నరకయాతన అనుభవించిన ఆమెను శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో స్తంభానికి కట్టేసి ఉన్న ఆమెను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్,

ఇతర పోలీసులు ఆమెను వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి (Medak Government Hospital) కి తరలించారు.అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

శనివారం రాత్రి అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Medak crime news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.