News Telugu: Medak Crime: మెదక్ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య…

Read Time:  1 min
Medak district
Medak district
FONT SIZE
GET APP

టేక్మాల్, డిసెంబర్ 2 ప్రభాతవార్త : కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ (Tekmal) మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) పచ్చని కాపురంలో కుటుంబ కలహాలు మొదలై ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

Read also: Guntur Crime: ప్రేమవివాహం చేసుకున్న IAS అధికారి కుమార్తె.. ఆపై ఆత్మహత్య

Medak district

Husband kills wife and commits suicide in Medak district

కుటుంబ కలహాల నేపథ్యంలో

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను చంపి భర్త ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం బృందం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తున్నారు. భార్యాభర్తల ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.