మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న సోమవరపు సురేంద్ర అలియాస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారాలు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బు, బంగారం తీసుకుని పలుచోట్ల అదృశ్యమవుతున్నాడని అధికారులు గుర్తించారు. కడపకు చెందిన ఈ వ్యక్తిపై పలువురు మహిళలు ఫిర్యాదులు చేయడంతో మోసాల పరంపర వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనీ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పెట్టి మహిళలకు పరిచయం అయ్యేవాడు.
Read also: TTD: 9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు
Stay safe with matrimony sites
15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు.
2017లో కరీంనగర్ (KARIMNAGAR) మహిళను వివాహం చేసుకున్న అతను, వేధింపుల కారణంగా 2020లో విడాకులు పొందించాడు. తర్వాత విజయవాడ, ఖమ్మం ప్రాంతాల మహిళలను పెళ్లి పేరుతో మోసగించి భారీ మొత్తాలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కేసులో భువనగిరి మహిళను క్రైస్తవ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసుకొని 15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు. పెళ్లి తర్వాత కుటుంబ పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆమె అనుమానం వ్యక్తమైంది.
సురేంద్రను కడపలో అరెస్ట్ చేశారు
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సురేంద్రను కడపలో అరెస్ట్ చేశారు. విచారణలో అక్కడ మరో మహిళను కూడా పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు బయటపడింది. నిందితున్ని రిమాండ్‌కు తరలించిన పోలీసులు మ్యాట్రిమోనీ మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు పూర్తిగా పరిశీలించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: