భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లుగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ ఇంట్లో జరిగిన దొంగతనం వార్తా ప్రపంచంలో సంచలనంగా మారింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 46లో ఆమె నివాసంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. మేరీ కోమ్ (Mary Kom) మేఘాలయలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు ఆమె విలువైన వస్తువులను దోచుకు వెళ్లారు. ఈ దోపిడిలో లక్షల రూపాయల విలువైన వస్తువులు అపహరించబడ్డాయి.
USA: అమెరికాలో కాల్పులు ..ముగ్గురి మృతి
మేరీ కోమ్ తన రెండంతస్తుల బంగళాకు కొన్ని రోజులుగా తాళం వేసి మేఘాలయ (Meghalaya) లోని సోహ్రాలో జరుగుతున్న మారథాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులతో పాటు ఓ టెలివిజన్‌ను కూడా ఎత్తుకెళ్లారు.
దొంగలు ఇంట్లో నుంచి వస్తువులను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డయ్యాయి.పొరుగువారు ఈ విషయాన్ని గమనించి మేరీ కోమ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, “నాకు చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఈ చోరీ ఈ వారం మొదట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ
24న ఈ ఘటన జరిగిందని పొరుగువారు చెప్పారు. నేను ఇంటికి తిరిగి వెళ్లాకే నష్టం ఎంత జరిగిందో కచ్చితంగా చెప్పగలను. సీసీటీవీ ఫుటేజీలో దొంగలు టీవీ, ఇతర వస్తువులు తీసుకెళ్లడం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చాను” అని తెలిపారు.ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఫరీదాబాద్ పోలీసులు (Faridabad Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: