News Telugu: Maoist: పోలీసులకు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్

Read Time:  1 min
Mallojula Venugopal surrenders to police
Mallojula Venugopal surrenders to police
FONT SIZE
GET APP

Maoist: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallujola venugopal) సోను తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుమారు 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు సమర్పించిన వేణుగోపాల్ రావు నిర్ణయం మావోయిస్టు (Maoist) శిబిరంలో ఆందోళన సృష్టించింది. గడ్చిరోలిలో అధికారుల సమక్షంలో లొంగిపోయిన వేణుగోపాల్ రావు గతంలో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక భూమిక వహించారు. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) కూడా మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా పనిచేశారు.

California: కుప్పకూలిన హెలికాఫ్టర్‌..వీడియో వైరల్‌

Mallojula Venugopal surrenders to police

Mallojula Venugopal surrenders to police

ఇటీవలి నెలల్లో మావోయిస్టు Maoist పార్టీ కార్యకలాపాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వేణుగోపాల్ రావు, పార్టీ మార్గదర్శకత్వం నుంచి దారి తప్పిందని విమర్శిస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో “అనవసర త్యాగాలు ఇక వద్దు, మార్పు అవసరం” అని పేర్కొన్నారు. ఆ లేఖ బయటకు రావడంతో పార్టీ లోపలే చర్చలు చెలరేగాయి. వరుస ఎన్‌కౌంటర్లతో Encounter అగ్రనేతలు, కేడర్ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు లొంగుబాట్లు పెరగడం వల్ల మావోయిస్టు ఉద్యమం బలహీనమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్ రావు లొంగుబాటు పార్టీకి మరింత గట్టి దెబ్బగా భావిస్తున్నారు.

మావోయిస్టు పార్టీకి తాజాగా ఎదురైన పెద్ద షాక్ ఏమిటి?
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు @ సోను 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు.

మల్లోజుల వేణుగోపాల్ రావు ఎవరు?
ఆయన మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.