Latest News: Mancherial Crime – అయ్యో..అంత కష్టం ఏమొచ్చిందమ్మ! మైనర్ బాలిక ఆత్మహత్య

Read Time:  1 min
Mancherial Crime
Mancherial Crime
FONT SIZE
GET APP

బెల్లంపల్లి మండలం (Bellampalli Mandal) లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. జీవితంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ బాలిక, అర్థంకాని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను షాక్‌కు గురి చేసింది.అకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గే రమేశ్‌, రాజక్క దంపతులు కూలిపనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ముగ్గురు కుమార్తెలలో రెండో సంతానం అయిన సుప్రియ (Supriya), (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు తాగేసింది

తెలివైన విద్యార్థిని అయిన సుప్రియ తన చదువులోనూ, ప్రవర్తనలోనూ అందరికి ఆదర్శంగా నిలిచేది.కానీ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఒక్కసారిగా కుటుంబాన్నీ షాక్ కు గురి చేసింది.ఉదయం 4 గంటల సమయంలో సుప్రియ ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు (Rat Medicine) తాగేసింది. కొద్ది సేపటికి ఆమెకు అస్వస్థత కలగడంతో, కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Mancherial Crime
Mancherial Crime

చికిత్స పొందుతూ సుప్రియ మృతి

వారు ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తరలించారు.అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల (Mancherial) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది. గత మూడు రోజులుగా సుప్రియ బడికి వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తమకు తెలియవని వారు కన్నీరుమున్నీరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tirumala-tamil-nadu-man-arrested-for-stealing-from-srivari-temple-mini-hundi/devotional/546416/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.