📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Mancherial crime: ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 30, 2026 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mancherial crime: ప్రేమించి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం ఆ యువతి పాలిట మృత్యుపాశమైంది. ఒక వ్యక్తి చేసిన మోసం, అనాలోచితంగా తీసుకున్న అబార్షన్ నిర్ణయం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Mancherial crime

వివరాల్లోకి వెళితే

తాండూర్ మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి (24) అనే యువతికి, అదే ప్రాంతానికి చెందిన గట్టు జగదీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జగదీశ్, ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. తీరా గర్భం దాల్చిన విషయం తెలిశాక, పెళ్లికి నిరాకరించిన జగదీశ్.. అబార్షన్(abortion death) చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

నగరాల చుట్టూ తిప్పినా దక్కని ప్రాణం

గర్భాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా జగదీశ్ బాధితురాలిని తొలుత హైదరాబాద్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ అబార్షన్ కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా, ఆమెను కర్నూలుకు తరలించి మరోసారి గర్భవిచ్ఛిత్తికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో చికిత్స వికటించి భాగ్యలక్ష్మికి తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో ఆమె గురువారం మృతి చెందింది. ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోవడమే కాకుండా, సరైన వైద్యం అందక ఆ యువతి ప్రాణాలు వదలడం అందరినీ కలిచివేసింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు

తమ సోదరి మరణానికి జగదీశ్ కారణమంటూ మృతురాలి అన్న కుమారస్వామి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇన్-చార్జి ఎస్ఐ సౌజన్య తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Crime Updates Illegal Abortion Justice for Bhagyalakshmi Mancherial News Tandur Tragedy Telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.