📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Maheshwaram Fire Accident: మహేశ్వరంలో హైటెన్షన్ తీగలు తగిలి బాణాసంచా లారీ దగ్ధం

Author Icon By Pooja
Updated: March 21, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maheshwaram Fire Accident: రంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మాణిక్యమ్మగూడ వద్ద బాణాసంచా లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా, రోడ్డుపై వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది.

Read Also:Moinabad Drugs Case Update: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

Maheshwaram Fire Accident: భారీగా పేలిన పటాసులు.. దద్దరిల్లిన మాణిక్యమ్మగూడ

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలోని బాణాసంచాకు మంటలు అంటుకున్నాయి. లోడులో ఉన్న పటాసులు భారీ శబ్దాలతో పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

అదృష్టవశాత్తూ తప్పిన ప్రాణనష్టం

ఈ భయంకరమైన ప్రమాదంలో లారీ పూర్తిగా కాలిపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై లారీ నుంచి కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. అజాగ్రత్తగా వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bengaluru to Hyderabad lorry accident Fire Accident Maheshwaram Firecrackers explosion Maheshwaram Firecrackers Lorry Catch Fire Hyderabad News Telugu.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.