తెలంగాణ–మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దు ప్రాంతంలో ఎలుగుబంటి దాడి తీవ్ర విషాదం నింపింది.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలుకా దయాల్ దన్నూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దత్త బలిరాం జాదవ్ (55) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంత గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: AI impact on stock market : AI షాక్, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ కుప్పకూలాయా?
సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలి
ఈ నెల 10న రాత్రి మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్ళిన ఆయనపై ఎలుగుబంటి దాడి చేసింది. అతన్ని రక్షించే ప్రయత్నంలో మరో 8 మంది రైతులు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: