📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu news: Maharashtra: భీమా కోసం హత్య .. పట్టించిన చాటింగ్

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర(Maharashtra)లోని లాతూర్ జిల్లా ఔసా ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ కారులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఈ ఘటన వెనుక అసలు కథ ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Accident: పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

కారులో లభించిన మృతదేహం బ్యాంక్ రికవరీ ఏజెంట్ అయిన గణేశ్ చవాన్‌(Ganesh Chavan)దేనని మొదట అనుమానించారు. అయితే దర్యాప్తు కొనసాగుతుండగా అనేక అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కారులో సెల్‌ఫోన్ సురక్షితంగా ఉండటం పోలీసుల దృష్టిని ఆకర్షించింది.

ఇంటి లోన్ తీర్చేందుకు కోటి బీమా ప్లాన్..

గణేశ్ చవాన్ ఇంటి లోన్ తీర్చేందుకు కోటి రూపాయల జీవిత బీమా డబ్బు పొందాలనే ఉద్దేశంతో తన మృతిని ప్రమాదంలా చూపించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పథకం అమలు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి కారు లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం అతడిని హత్య చేసి, డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవదహనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన చేతికి ఉన్న బ్రాస్లెట్‌ను కూడా అక్కడే వదిలేశాడు.

Maharashtra: Murder for insurance… a hidden chat

దర్యాప్తులో గణేశ్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆమెను విచారించగా, చనిపోయాడని భావించిన గణేశ్ మరో మొబైల్ నంబర్ నుంచి తనకు సందేశాలు పంపుతున్నాడని వెల్లడించింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ కొత్త నంబర్‌ను ట్రాక్ చేశారు.

ఆ ట్రాకింగ్ ఆధారంగా గణేశ్ చవాన్ సింధుదుర్గ్ జిల్లా విజయదుర్గ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అక్కడే అతడిని అరెస్టు(Arrest) చేశారు. పోలీసుల విచారణలో నేరానికి పాల్పడినట్లు గణేశ్ ఒప్పుకున్నాడు. శనివారం రోజున గోవింద్ యాదవ్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

ప్రస్తుతం గణేశ్ చవాన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘటనలో మరెవరైనా పాత్రధారులున్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు లాతూర్ జిల్లా పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aausa Crime News Fake Death Plan Ganesh Chavan Insurance Fraud Case Latur District Maharashtra Crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.