Latest News: Maharashtra Crime: టీచర్ పనిష్మెంట్ వల్ల మృతిచెందిన బాలిక

Read Time:  1 min
Latest News: Maharashtra Crime: టీచర్ పనిష్మెంట్ వల్ల మృతిచెందిన బాలిక
FONT SIZE
GET APP

ఉపాధ్యాయులు అంటే పిల్లల భవిష్యత్తుకు దీపస్తంభాలు. వాళ్లు నేర్పే ఒక్క మాట, ఒక్క పాఠం కూడా పిల్లల జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కానీ అదే గురువులు నిర్లక్ష్యం, కోపంతో వ్యవహరించినప్పుడు చిన్నారుల జీవితాలు చీకటిలో మునిగిపోతాయి. హృదయ విదారక సంఘటన మహారాష్ట్రలో (Maharashtra) ని వాసాయిలో వెలుగులోకి వచ్చింది. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్‌కు చిల్డ్రెన్స్ డే రోజే ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Read Also: Bihar Government : బీహార్ కొత్త ప్రభుత్వం నవంబర్ 19-20లో ఏర్పాటుకానుంది

వారం రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాసాయి (ఇ)లోని శ్రీ హనుమంత విద్యా మందిర్‌లో కాజల్ గౌడ్ అనే 13 ఏళ్ల బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో నవంబర్ 8న పాఠశాలకు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది.

దీంతో ఆగ్రహానికి గురైన క్లాస్ టీచర్.. కాజల్‌కు పనిష్మెంట్ ఇచ్చింది. స్కూల్ బ్యాగు వీపుపై ఉండగానే 100 గుంజీళ్లు తీయాలని బలవంతం చేసింది. టీచర్‌కు అడ్డుచెప్పలేని బాలిక.. తనతో పాటు ఆలస్యంగా వచ్చిన వారితో కలిసి స్కూల్ బ్యాగ్‌తోనే 100 గుంజీళ్లు తీసింది. అయితే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కాజల్ ఆరోగ్యం క్షీణించింది.

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు

మెడ నుంచి కింద భాగం నొప్పిగా ఉందని, కదళ్లేకపోతున్నానని తనతో చెప్పినట్లు ఆమె తల్లి తెలిపింది.తల్లిదండ్రులు బాలికను వెంటనే వాసాయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను జేజే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలల దినోత్సవం నాడు (నవంబర్ 14) 11 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది బాలిక.

తమ కుమార్తె మృతి చెందడానికి టీచర్, పాఠశాల కారణమని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. వాలివ్ పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.ఈ విషయం గురించిన తెలిసిన స్థానిక ఎంఎన్ఎస్ కార్యకర్తలు పాఠశాలకు తాళం వేశారు.

తప్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉందని

అందులో ఓ కార్యకర్త సచిన్.. బాలికకు ఆస్తమా/ శ్వాస సమస్యలు ఉన్నాయని తెలిపారు. అందులో టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తట్టుకోలేకపోయిందని చెప్పాడు. కాగా, బాలిక మృతిపై స్పందించిన పాఠశాల అధికారి వికాస్ యాదవ్.. పనిష్మెంట్ కారణంగానే బాలిక మృతి చెందిందని తేలితే..

తప్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ గలాంగే స్పందించారు. ఈ ఘటనపై తాము అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.