📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Madras: పిల్లల పెంపకంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Pooja
Updated: December 29, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలను క్రమశిక్షణతో, భద్రతతో పెంచే బాధ్యతను తల్లులు నిర్లక్ష్యం చేస్తే కుటుంబ వ్యవస్థతో పాటు సమాజం కూడా ప్రమాదంలో పడుతుందని మద్రాస్ హైకోర్టు(Madras) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Read Also: AP Crime: దోమల చక్రం వల్ల బాలుడు మృతి

Madras: The High Court made strong remarks on child rearing.

కోయంబత్తూర్ ఘటనపై కేసు వివరాలు

కోయంబత్తూర్‌కు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి తన 14 ఏళ్ల కూతురితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 2017లో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దృష్టి పెట్టి వేధింపులకు పాల్పడినట్టు కేసులో వెల్లడైంది. బాలిక తనపై జరుగుతున్న వేధింపులను తల్లికి చెప్పగా, ఈ విషయం ఎవరికి చెబితే ఆత్మహత్య చేసుకుంటానని తల్లి బెదిరించినట్టు కోర్టు ముందు వెల్లడైంది. ఆ తరువాత కూడా ఆ వ్యక్తి బాలికను లైంగికంగా వేధించడం కొనసాగించాడు.

పోక్సో కోర్టు తీర్పు, హైకోర్టు నిర్ణయం

చివరికి బాలిక తన తండ్రికి జరిగిన ఘటనను తెలియజేయడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి మరియు ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోయంబత్తూర్ పోక్సో కోర్టు 2020లో ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వారు మద్రాస్ హైకోర్టులో(Madras) అప్పీల్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ వేల్‌మురుగన్, జస్టిస్ జ్యోతిరామన్లతో కూడిన ధర్మాసనం, పోక్సో కోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని పేర్కొంటూ అప్పీల్‌ను తిరస్కరించింది.

తల్లుల బాధ్యతపై హైకోర్టు స్పష్టత

తల్లుల అనైతిక ప్రవర్తన వల్లే చిన్నారులపై ఇలాంటి లైంగిక నేరాలు జరుగుతున్నాయని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మన సంస్కృతిలో తల్లికి ఉన్న గౌరవం, ప్రాధాన్యతను గుర్తుచేసింది. పిల్లలను సురక్షితంగా, గౌరవంతో, క్రమశిక్షణతో పెంచడం తల్లుల ప్రధాన బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఆ పవిత్రమైన బాధ్యతను విస్మరిస్తే కుటుంబం మాత్రమే కాక సమాజం కూడా తన పునాదులను కోల్పోయే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

child safety Google News in Telugu Latest News in Telugu Parenting Responsibility POCSO case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.