📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Madhya Pradesh: నూడుల్స్ ఆర్డర్‌ కోసం కొట్టుకున్న వైద్య విద్యార్థులు

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నూడుల్స్ ఆర్డర్‌ (noodles Order) అంశంపై మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు రాడ్లు మరియు కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Babri Masjid Issue: బంగాల్​లో టెన్షన్ టెన్షన్

ఈ సంఘటన డిసెంబర్ 4న ఎయిమ్స్ భోపాల్‌లో జరిగిన రెటీనా ఫెస్ట్ (Retina Fest) అనంతరం జరిగింది. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు అర్ధరాత్రి వేళ క్యాంపస్‌కు తిరిగి వచ్చారు. వీరిలో కొందరు మద్యం మత్తులో ఉన్నారు. ఒక కేఫ్ వద్ద నూడుల్స్ ఆర్డర్ ఇవ్వగా, ‘నూడుల్స్ మొదట ఎవరు పొందాలి’ అన్నదానిపై విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది.

Madhya Pradesh Medical students clash over noodles order

2024 బ్యాచ్‌కు చెందిన పరాస్‌ను సుమారు 15 మంది విద్యార్థులు చుట్టుముట్టి కర్రలతో కొట్టారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శైలేష్ చౌదరి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, దాడి చేసిన విద్యార్థులు ఆయన్ని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ శైలేష్ చౌదరిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. చేతికి, భుజానికి గాయాలైన పరాస్‌ను చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.

15 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

ఈ ఘటనపై గాంధీ మెడికల్ కాలేజీ (Gandhi Medical College) యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. డిసెంబర్ 5న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఈ హింసాత్మక చర్యకు పాల్పడిన 15 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, హాస్టల్‌ను వెంటనే ఖాళీ చేయాలని వారిని ఆదేశించింది. క్యాంపస్‌లో హింసను సహించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని డీన్ డాక్టర్ కవితా ఎన్ సింగ్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AlcoholInfluence BhopalIncident GandhiMedicalCollege Google News in Telugu HospitalAdmitted Latest News in Telugu madhyapradesh MBBSClash MedicalStudentsSuspended NoodlesFight Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.