📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madhya Pradesh: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

Author Icon By Saritha
Updated: February 14, 2026 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ (MBA) విద్యార్థిని, తన క్లాస్‌మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. మంగళవారం బర్త్‌డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్దె గదిలో నగ్నంగా, శవమై తేలడం కలకలం రేపింది.

ఈ దారుణం వెనుక పక్కా పథకం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి అదృశ్యమైన రోజే ఆమె మొబైల్ ఫోన్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూపులోకి ఒక అశ్లీల వీడియో అప్‌లోడ్ అయింది. అందులో యువతి ముఖం స్పష్టంగా కనిపిస్తుండగా, నిందితుడు తన ముఖాన్ని ఎమోజీలతో కప్పివేశాడు. ఈ వీడియో చూసి దిగ్భ్రాంతికి గురైన కాలేజీ యాజమాన్యం, వెంటనే దాన్ని తొలగించి ఆమె తండ్రికి సమాచారం అందించింది. అప్పటికే బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు.

Read Also: Jaipur: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

MBA student brutally murdered in Indore

పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు

(Madhya Pradesh) పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. బుధవారమే ఫిర్యాదు చేసినా పోలీసులు త్వరగా స్పందించలేదని, ఒక కానిస్టేబుల్ నిందితుడి గది వరకు వెళ్లి తలుపు లాక్ చేసి ఉండటంతో వెనక్కి వచ్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా, పోలీసులు తలుపులు పగలగొట్టి చూడటంతో దారుణం వెలుగుచూసింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, తండ్రి తన కూతురిని ఆమె ధరించిన సాక్స్ ఆధారంగా మాత్రమే గుర్తుపట్టగలిగారు.

విచారణ ప్రకారం నిందితుడు పీయూష్ ఆమెను తాడుతో ఉరివేసి చంపి పరారయ్యాడు. నిందితుడు బాధితురాలిని గత కొంతకాలంగా మానసిక వేదనకు గురిచేస్తూ, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందసౌర్ ప్రాంతానికి చెందిన నిందితుడు పీయూష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Classmate Crime indore Latest News in Telugu Madhya Pradesh MBA Student Murder Piyush Dhanotia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.