మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో జరిగిన ఓ దారుణ ఘటన అందరినీ కలచివేసింది. నడిరోడ్డుపై, ప్రజలు చూస్తుండగానే ఒక వ్యక్తి తన భార్యపై తుపాకీతో కాల్పులు జరపడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడు కాల్పులు జరిపిన తర్వాత కూడా అక్కడి నుంచి పారిపోకుండాతన భార్య పక్కనే కూర్చున్నాడు. సాధారణంగా ఇలాంటి ఘటనలు సినిమాల్లో మాత్రమే చూడగలిగే స్థాయిలో ఉంటాయి. కానీ గ్వాలియర్ (Gwalior) లో ఇది వాస్తవంగా చోటుచేసుకోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.
స్థానికంగా ఉన్న రూప్ సింగ్ స్టేడియం ఎదుట ఈ హత్య జరిగింది. అరవింద్ పరిహార్ (Arvind Parihar) అనే వ్యక్తి తన భార్య నందినిపై పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. పక్కన జనం ఉన్నా, పట్టపగలే ఈ దుశ్చర్యకు పాల్పడడంతో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా నిందితుడు అరవింద్ వారిని కూడా పిస్టల్‌తో బెదిరించడానికి ప్రయత్నించాడు.
పెళ్లి సమయంలో తప్పుడు హామీలు చెప్పి మోసం
పోలీసులు చాకచక్యంగా టియర్ గ్యాస్ (Tear gas) ప్రయోగించి, ఎంతో శ్రమపడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అరవింద్ పెళ్లి సమయంలో నందిని (Nandini) ని మోసం చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లి సమయంలో తప్పుడు మాటలు, హామీలతో నమ్మించి వివాహం చేసుకున్నాడు. తీరా ఇదే విషయమై నిలదీస్తే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 9న నందిని ఎస్పీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది.
తన భర్త అరవింద్ పెళ్లి సమయంలో తప్పుడు హామీలు చెప్పి తనను మోసం చేశాడని.. అదే విషయం అడిగితే తరచూ దాడి చేస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరవింద్ భార్యను చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. భార్య తనతో తరుచూ గొడవ పడుతుందని.. తనని దోషిగా చూపిస్తూ పోలీసు కేసు పెట్టడంతో ఆవేశంలో కాల్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన నందినిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. నందిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరవింద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: