📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Madhya Pradesh: అగ్రి వర్సిటీలో యువతిపై సామూహిక అత్యాచారం

Author Icon By Rajitha
Updated: December 27, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్త్రీలపై నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడి (Sexual violence) జరుగుతూనే ఉంది. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. నిర్భయా చట్టం, దిశా చట్టం ఇలా ఎన్ని వస్తున్నా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఓ యువతిని ఉద్యోగం పేరుతో నమ్మించి అగ్రి యూనివర్సిటీ సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతున్నది. ఉద్యోగం పేరుతో పెంచుకున్న పరిచయం జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఖాళీల గురించి సోషల్ మీడియా ప్రచారం జరిగింది. అయితే తిల్వారా ప్రాంతానికి చెందిన ఓ యువతి(22) ఫోన్ నెంబర్ కనుగొని వైస్-ఛాన్సలర్ కార్యాలయానికి ఫోన్ చేసింది.

Read also: Delhi Crime: రూ.20 లు ఇవ్వలేదని.. భార్య గొంతు కోసి చంపిన భర్త

Madhya Pradesh

యూనివర్సి టీలో పనిచేసునతన్న క్లర్క్ దుర్గా శంకర్ సింగెరా (58), ప్యూన్ ముఖేష్ సేన్ లతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని సింగెరా నమ్మబలికాడు. పత్రాలతో విశ్వవిద్యాలయానికి రమ్మని చెప్పాడు. దీంతో ఆ యువతి మరుసటి రోజు పనరతాలతో యూనివర్సిటీకి వచ్చి, సింగెరాను కలిసింది. వైస్-ఛాన్సలర్ తో మాట్లాడిన తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, టచ్ లో ఉండమని చెప్పాడు. దీంతో ఆమె ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకునేది. ఈ క్రమంలో నగరంలో పలుమార్లు ఆ యువతిని కలిశారు. అయితే ఉద్యోగం హామీ ఇస్తూ వచ్చాడు సింగెరా

ఇంటికి రమ్మని పిలిచి అత్యాచారం

గురువారం మధ్యాహ్నం క్లర్క్, ప్యూన్ ఆమెను విశ్వవిద్యాలయానికి పిలిచి త్వరలో ఇంటర్వూ, షెడ్యూల్ వస్తుందని తెలిపారు. క్యాంపస్ లో ఉండే తమ ఇంటికి రావాలని యువతిని సింగెరా కోరాడు. ఆయన మాటలు నమ్మి వెళ్లినందుకు క్లర్క్ శంకర్ సింగెరా, ప్యూన్ ముఖేష్ లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మౌనంగా ఉంటేనే ఉద్యోగం వస్తుందని లేదంటే రాదని బెదిరించి, యువతిని పంపించి వేశారు. మోసపోయానని గ్రహించిన యువతి, కుటుంబ సభ్యులతో కలిసి అధర్తల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. నిందితులను అరెస్టు చేసి, కస్టడీకి తరలించారు. ఇలాంటి మోసపూరిత మాటలను నమ్మవద్దని, నమ్మి వారి గృహాలకు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువతి తన కుటుంబ సభ్యుల సహకారంతో క్లర్క్ ఇంటికి వెళ్లి ఉంటే ఇలాంటి అఘాయిత్యం జరిగేది కాదని అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news sexual assault Telugu News university staff crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.