Madanapalle Girl Murder: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న బాలిక దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డు వద్ద ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: budget: ఎంఎస్ఎం రంగానికి భారీ కేటాయింపులు: కొండపల్లి శ్రీనివాస్
నిందితుడిని అప్పగించాలని ఆందోళన
హత్యకు పాల్పడిన వ్యక్తిని తమకు అప్పగించాలని లేదా వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది స్థానికులు, హిజ్రాలు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
పోలీసుల పహారా
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన మదనపల్లె పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: