Lucknow Crime: NEET ఒత్తిడితో తండ్రి హత్య

Read Time:  1 min
Lucknow Crime
Lucknow Crime
FONT SIZE
GET APP

Lucknow Crime: నీట్ పరీక్షకు సిద్ధం కావాలంటూ తండ్రి తరచూ ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి లోనైన కుమారుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగుచూసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆధారాలు దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read also: Jharkhand Plane Crash: అంబులెన్స్ ప్రమాదం.. డీజీసీఏ కీలక అప్‌డేట్!

మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం

Lucknow Crime
Lucknow Crime: Father murdered under pressure from NEET

19 ఏళ్ల అక్షత్ ప్రతాప్ సింగ్ తన తండ్రి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఫిబ్రవరి 20 నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా, అనుమానాస్పదంగా అతడి సొంత ఇంట్లోని డ్రమ్‌లో మృతదేహం బయటపడింది. దీంతో కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నేరాన్ని అంగీకరించిన నిందితుడు

విచారణలో అక్షత్ తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. తండ్రి తరచూ పరీక్షలపై ఒత్తిడి చేయడంతో గొడవలు జరిగేవని పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొన్ని భాగాలను నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసి, మరికొన్ని భాగాలను ఇంట్లో దాచినట్లు వివరించాడు.

పోలీసులు విచారణ కొనసాగింపు

ఘటన స్థలాన్ని సీనియర్ అధికారులు, ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించగా, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.