📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Lucknow: బాలికపై కానిస్టేబుల్ దంపతుల దాడి

Author Icon By Sharanya
Updated: June 12, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో (Lucknow) లోని లాల్‌పూర్ ప్రాంతంలో ఓ 16 ఏళ్ల బాలికపై జరిగిన ఘోర దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘మీ భర్త నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు’ అని నిజాన్ని చెప్పినందుకు తొలుత భర్తతో గొడవ పడిన సదరు మహిళ, ఆపై భర్తతో కలిసి బాలికపైనే దాడి చేసింది.

ఒంటరిగా ఉన్న బాలికపై కానిస్టేబుల్‌ వేధింపులు

లక్నోలోని లాల్‌పూర్ ప్రాంతంలో బాధితురాలు (16) తన కుటుంబంతో నివసిస్తోంది. వారి ఎదురింట్లో ఓ కానిస్టేబుల్, అతని భార్య (మహిళా కానిస్టేబుల్) ఉంటున్నారు. రెండు కుటుంబాలకూ ఒకే టాయిలెట్‌ ఉంది. ఈ క్రమంలో తాను ఒంటరిగా ఉన్నప్పుడు సదరు కానిస్టేబుల్ లైంగికంగా వేధించేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు ఆరోపించింది. ఆ కానిస్టేబుల్ చాలా కాలంగా నన్ను చెడు దృష్టితో చూస్తున్నాడు. చాలాసార్లు నా దారికి అడ్డొచ్చి, చేయి పట్టుకుని అసభ్యంగా మాట్లాడాడు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

మొదట భర్తను మందలించిన కానిస్టేబుల్ భార్య

సోమవారం ఈ వేధింపులు భరించలేక కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పింది. తొలుత తన భర్తతో గొడవపడిన భార్య, కొంత సమయం తర్వాత బయటకు వచ్చి, భర్తపై మొదట కోపం చూపించిన ఆమె, ఆ తర్వాత అతనితో కలసి బాలికను ఎదిరించారు. బాధితురాలు వాపోయింది.

రెండంతస్తుల భవనం పైనుంచి తోసివేత

కొంత సమయం తర్వాత బయటకు వచ్చి, రెండంతస్తుల భవనం పైనున్న కామన్ ఏరియాలో కూర్చున్న బాలికను ఆధారం చూపించమని డిమాండ్ చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి తనపై దాడి చేసి, భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలు వాపోయింది.

బాలిక తండ్రిపై కూడా దాడి

బాలిక కిందపడి ఉండటం చూసిన ఆమె కుటుంబ సభ్యులు, తండ్రి పైకి వెళ్లి నిలదీయగా, కానిస్టేబుల్ దంపతులతో పాటు అక్కడకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ సోదరుడు కూడా కలిసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలిక, ఆమె తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల చర్య: ఎఫ్ఐఆర్ నమోదు

ఈ ఘటనపై మంగళవారం బీబీడీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ దంపతులు, మహిళా కానిస్టేబుల్ సోదరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Raja Raghuvanshi: సోదరుడి హత్యపై శ్రస్తి రఘువంశీ ఏమన్నారంటే?

#ConstableAssault #crimenews #GirlAssault #Lucknow #PoliceBrutality Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.