📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest Telugu News: Love: ప్రేమలు.. పెళ్లిళ్లు..విషాదంగా ముగుస్తున్న వైనం..

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లంటే నూరేళ్ల పండుగ అంటారు. వివాహం స్వర్గంలో జరుగుతాయని పెద్దలంటారు. అంటే పెళ్లితో యువతి, యువకుడు జీవితాంతం ఒకరిపై ఒకరు ఆధారపడి, అనురాగాన్ని, ప్రేమను పంచుకుంటూ తమదైన అందమైన గృహాన్ని నిర్మించుకోవడమే కదా! సమాజానికి కుటుంబమే పునాది. సమాజం బాగుండాలి అంటే కుటుంబం బాగుండాలి. లేకపోతే సమాజం పాడైపోతే, దేశం పురోగభివృద్ధి కుంటుపడుతుంది. ప్రేమించి(Love) పెళ్లి చేసుకున్న గడ్డంరాజు అనే యూట్యూబర్‌ (Yourtuber) ఆత్మహత్య చేసుకుని రోజులు గడవక ముందే మరో ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేమించి(Love) పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతీ యువకులు అందర్నీ ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ, వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో ఆత్మహత్య(Suicide)కు పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా(Janagama District) స్టేషన్‌ఘన్‌పూర్‌ (Station Ghanpur) మండలం తాటికొండ గ్రామంలో నెలకొన్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Crime: మైనర్ బాలికపై అత్యాచారం..ఆపై హత్య

ఇళ్లు వదిలి వచ్చేసిన పావని

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామానికి చెందిన అంజయ్య-,రేణుక దంపతుల పెద్ద కుమారుడు మారపాక అన్వేశ్‌(22), హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాలకు చెందిన గడ్డం దాస్, ఎలీషా దంపతుల కూతురు పావని (20) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్‌ తన ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే పావని మూడునెలల క్రితం ఇళ్లు వదిలి అన్వేష్‌తో వచ్చేసింది. తల్లి దండ్రులు కూడా ఒప్పుకోవడంతో పావని తల్లిదండ్రుల అనుమతితో అన్వేష్‌ వాళ్లింట్లోనే ఉంటుంది. కాగా, ఈ విషయమై పావని తల్లిదండ్రులు నెల రోజుల కిందట పంచాయితీ పెట్టారు. తమ కూతురుని తీసుకువచ్చాడని ఆరోపించారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని త్వరలోనే వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు.

Love: ప్రేమలు.. పెళ్లిళ్లు..విషాదంగా ముగుస్తున్న వైనం..

పెళ్లికి ఏర్పాట్లు ..ఇంతలోనే ఆత్మహత్య

వీరి పెళ్లికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే అబ్బాయి తరుఫున బంధువులు, కులస్థులు చనిపోతూ రావడం, ఇతర కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంలో వారం రోజులుగా అన్వేష్‌- పావనిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన వారు చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ గడ్డి మందు తాగారు. ఇంట్లో వాళ్లు వచ్చే సమయానికి వారిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఘన్‌పూర్‌ ప్రభుత్వ వైద్యశాలకు.. అనంతరం అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకి తరలించారు. అన్వేశ్‌ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

విషమంగా పావని పరిస్థితి

పావని పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. అమ్మాయి తండ్రి దాస్‌ ఏడాది క్రితం మృతి చెందడంతో తల్లి ఒక్కతే ఉంది. అయితే రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్థల మూలంగా వారు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లిచేసుకుని ఆనందంగా జీవితం సాగించాల్సిన జంట అర్థంతరంగా ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలిచి వేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పిట్ట రాజేష్‌ వివరించారు.

ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య చేసుకోవడం సరైనదేనా?

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

breakups emotional pain love failures Love Stories Modern Relationships relationship issues societal pressure Telugu News tragic marriages

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.