📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sucide: కట్నందాహం ముందు ఓడిన ప్రేమబంధం

Author Icon By Sharanya
Updated: July 28, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ ఇల్లాలు భర్తను ప్రేమించి పెళ్లాడింది. కోటిఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రేమించినవాడే తన ఊపిరిగా భావించింది. కానీ ఆ ప్రియుడే తన ప్రాణం తీసుకునేంతగా వేధిస్తాడని భావించలేకపోయింది. పట్టుమని నాలుగు నెలలు పూర్తికాకముందే ఆమె అర్థాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త శాడిస్ట్గా మారడంతో ఆమె సెల్ఫీ వీడియోను తీసి, ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide by hanging)కు (Sucide) పాల్పడింది. ఈవీడియో వైరల్గా మారింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (Lucknow) లో బికెటి పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న అనురాగ్సింగ్, సౌమ్యకశ్యప్ ఇద్దరు ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే కట్నం కోసం భర్త, అత్తమాలు, అతని బావ, బావసోదరుడి వేధించడం ఆరంభించారు. డబ్బు, అధికారం చూసుకుని భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. సౌమ్యను మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

సెల్ఫీ సూసైడ్

సౌమ్యకశ్యప్ ఆత్మహత్యకు పాల్పడేముందు సెల్ఫీవీడియోను తీసుకుంది. ‘నిస్సహాయులైన బేటీలకు రక్షణ ఏదంటూ’ వాపోయింది. అంతేకాదు సౌమ్య తన అత్తమామలపై, భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తన భర్త, అత్తమామలు తనను తిరిగి వివాహం చేసుకోవాలని, మానసికంగా వేధించారని సౌమ్య కన్నీటితో తన గోడును చెప్పుకుంది. తన
బావమరిది తనను చంపేస్తానని బెదిరించాడని సౌమ్య ఆరోపించింది. ‘డబ్బుతో వారు ఏమైనా చేయగలరు. న్యాయం కోసం పోలీసుల చుట్టు తిరిగినా తన గోడు ఎవరూ వినలేదని, తనను ఇంతగా హింసించి, బతకలేని పరిస్థితులు కల్పించిన ఎవరినీ వదలొద్దు’ అంటూ సూసైడ్కి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో సౌమ్య కశ్యప్ ఆరోపించింది. అనంతరం సౌమ్య తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని (Sucide) మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబం అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Crime: కంటి రెప్పే కాటువేస్తే..!

Breaking News Dowry Harassment latest news love marriage tragedy Lucknow Suicide Due to Dowry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.