📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

News Telugu: Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ

Author Icon By Rajitha
Updated: October 26, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఫ్రాన్స్‌లోని (prance) లావ్రే మ్యూజియం (Louvre Museum) మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన భారీ నగల చోరీ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నెపోలియన్‌కు చెందిన విలువైన నగలు దొంగిలించబడటంతో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి చోరీలు చాలా మ్యూజియంలలో జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక్కసారి ఇంత విలువైన వస్తువులు దొంగిలించిన తర్వాత అవి అమ్మడం ఎలా సాధ్యం? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎందుకంటే ఆ వస్తువులు ప్రజలకే కాదు, చరిత్రకూ చెందినవిగా గుర్తింపు పొందినవి. మీడియాలో వాటి ఫొటోలు, వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని గుర్తించకుండా అమ్మడం దాదాపుగా అసాధ్యమే. అయితే, నిపుణుల ప్రకారం, ఈ దొంగసొత్తు బ్లాక్ మార్కెట్ లేదా డార్క్ వెబ్‌ ద్వారా అమ్మబడుతుందని చెబుతున్నారు. డార్క్ వెబ్‌లో కొనేవారు, అమ్మేవారు ఇద్దరి గుర్తింపులు దాచబడతాయి. ఈ మార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రహస్య సేకరణకారులు (Private Collectors) ఈ అరుదైన వస్తువులను కొనుగోలు చేస్తారట.

Read also: Pak-Afghan: పాక్ రక్షణ మంత్రి యుద్ధానికి రెడీ – శాంతి మార్గం విఫలమా?

Louvre Museum: లావ్రే మ్యూజియంలో ఇటీవల భారీ చోరీ

కొన్ని సందర్భాల్లో, పెయింటింగ్స్ లేదా నగలను ముక్కలు చేసి, కొత్త రూపంలో మార్చి మార్కెట్‌లో అమ్ముతారట. సాధారణంగా అలా చేస్తే విలువ తగ్గుతుందని అనిపించినా, కొందరికి “నెపోలియన్ ధరించిన నగలోని చిన్న భాగం” సొంతం చేసుకోవడం కూడా ప్రతిష్టగా భావిస్తారు. ఆ కారణంగానే ముక్కలుగా చేసినా విలువ మరింత పెరగడం కూడా జరుగుతుంది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైలా అమినెడోలెహ్ వివరించినట్లు, ఈ దొంగతనాలు కేవలం “ఎత్తుకుపోవడం” మాత్రమే కాదు ముందే అమ్మకాల నెట్‌వర్క్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు. అందుకే ఒకసారి ఈ సొత్తు బయటకు వెళ్ళిన తర్వాత, దాన్ని తిరిగి కనుగొనడం చాలా కష్టం అవుతుంది.

లావ్రే మ్యూజియం ఎక్కడ ఉంది?
లావ్రే మ్యూజియం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మ్యూజియంలలో ఒకటి.

నెపోలియన్‌కు చెందిన నగలు ఎందుకు విలువైనవి?
అవి చారిత్రకంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగినవి. వాటి వెనుక ఉన్న కథే వాటి విలువను నిర్ణయిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

art smuggling jewelry theft latest news Louvre Museum Napoleon jewels Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.