📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Bhopal: ప్రియురాలిని చంపీ బెడ్‌షీట్‌లో చుట్టి.. ఇంట్లోనే 3 రోజుల పాటు..

Author Icon By Shobha Rani
Updated: July 1, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆగని హత్యలు యావత్‌ దేశాన్ని కుదిపివేస్తున్నాయి. వయసు బేధం లేకుండా పడనివారు ఎవరైనా సరే నిర్ధయగా చంపేసి హంతకులుగా మారుతున్నారు. హంతకుల్లో చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ ఉంటున్నారు. తాజాగా మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహజీవనం మరో యువతి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

లివ్‌-ఇన్ సంస్కృతిలో పెరుగుతున్న హత్యలు

రాజధాని భోపాల్‌(Bhopal)లోని బజారియా (Bazaria)పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక యువకుడి ఇంట్లో మూడు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం దొరికిన ఇంట్లోని యువకుడు మృతురాలి ప్రియుడు, లివ్-ఇన్ పార్టనర్ (Live-in partner) అని స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఆ అమ్మాయి అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఒకే ఇంట్లో ఉంటుండగానే అతడు హత్యకు పాల్పడ్డాడు. తన ప్రియురాలిని చంపిన తర్వాత అతడు మృతదేహాన్ని బెడ్‌ షీట్‌లో చుట్టి పారిపోయాడు. సోమవారం రాత్రి హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హంతకుడు, మృతురాలి లివ్‌-ఇన్‌ పార్టనర్‌ అయిన సచిన్ రాజ్‌పుత్‌(Sachin Rajput)ను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు అదుపులో – విచారణ కొనసాగుతోంది

Bhopal: ప్రియురాలిని చంపీ బెడ్‌షీట్‌లో చుట్టి.. ఇంట్లోనే 3 రోజుల పాటు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సచిన్ రాజ్‌పుత్ మద్యం మత్తులో ఉండగా తన ప్రియురాలు రితిక(Ritika)ను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తన స్నేహితుల్లో ఒకరికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు భయపడిపోయాడు. వెంటనే హత్య గురించి బజారియా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహంపై పంచనామా చేసిన తర్వాత మార్చురీకి తరలించారు. రితిక హత్యకు పాల్పడిన లివ్-ఇన్ పార్టనర్ సచిన్ రాజ్‌పుత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Read Also: Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు

Bhopal Crime 2025 Bhopal Murder Case Breaking News in Telugu Google news Latest News in Telugu Live-in Partner Murder Live-in Relationship Killings MP Crime News Paper Telugu News Ritika Murder Bhopal Sachin Rajput Arrested Sachin Rajput Ritika Murder Shocking Murder in Madhya Pradesh Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.