📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి

Author Icon By Saritha
Updated: November 10, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళలపై లైంగిక దాడులు(Sexual assault) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాల భారీన పడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏదోఒకవిధమైన దాడులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ అత్యాచార బాధితురాలు తనకు న్యాయం చేయమని కోరిన న్యాయవాదే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన చారణ సంఘటన ఇది. (Uttar Pradesh crime)ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు న్యాయం చేస్తానని ఓ లాయర్ నమ్మించి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: ఏపీలో భూముల ధరలకు రెక్కలు

Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి

ఆగ్రాలోని హోటల్కు తీసుకెళ్లిన నిందితుడు

2022లో సామూహిక అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకరికి ప్రాతినిధ్యం వహిస్తున్న 40 ఏళ్ల న్యాయవాది జితేంద్ర సింగ్ అలియాస్ జితేంద్ర ధాక్రే బాధితురాలికి న్యాయం చేస్తానని మాయమాటలు చెప్పాడు. తన కేసు విచారణకు హాజరు అయ్యేందుకు ఔరయ్య నుంచి ఆగ్రా వచ్చిన 24 ఏళ్ల బాధితురాలిని(Uttar Pradesh crime) జితేంద్ర సింగ్ కలిశాడు. కోర్టు బయటే రాజీ కుదిర్చి సెటిల్మెంట్ చేస్తానని నమ్మబలికాడు. అదే రోజు ఆమెను తన కారులో ఎక్కించుకుని వెళ్తూ, మధ్యలో ఆల్కహాల్ తాగించి, ఆగ్రా నగరంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. సమయం మించిపోయిందని, ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుందని చెప్పి ఆమె కోసం హోటల్లో గదిని బుక్ చేశాడు. తొలుత గదిలోంచి వెళ్లినట్లు నటించిన లాయర్ జితేంద్ర సింగ్.. రాత్రి భోజనం తీసుకుని వెళ్లి ఆమె గదికి తిరిగి వచ్చాడు.

మాట్లాడాలి అనే నెపంతో అత్యాచారం

కేసు గురించి మాట్లాడాలనే నెపంతో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గది లోపలి నుంచే తలుపు లాక్ చేసి ఆమెను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అప్పటికే ఓసారి ఆమెపై పడి కోరిక తీర్చుకోగా.. మరోసారి అతడి చేతిలో అత్యాచారానికి గురి కాకూడదని భావించిన బాధితురాలు అతడితో ఇష్టంగా ఉన్నట్లు మాట్లాడింది. నీళ్లు తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి.. గదిలోంచి తప్పించుకుని బయటకు వచ్చేసింది. ఎవరికీ కనిపించకుండా హోటల్లోనే ఓ చోట దాక్కుంది. నిందితుడు హోటల్ నుంచి వెళ్లిపోయేంత వరకు అక్కడే ఉండిపోయిందది. దీంతో లాయర్ బాధితురాలి కోసం వెతికాడు. కానీ ఆమె కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పారి పోయిందని భావించి, ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు హోటల్ గదిలోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయమే బాధితురాలు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, విజిటర్ రికార్డులు సేకరించారు. జితేంద్ర సింగ్ ను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా నిందితుడు వారి కళ్లగప్పి పారిపోయేందుకు యత్నించి, పొరుగువారి ఇంటి భవనం పైనుంచి దూకేశాడు. దీంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, చికిత్స అందిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి అతనికి జ్యూడిషియల్ కస్టడీ విధించి, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

agra news Criminal cases Latest News in Telugu Law and order Lawyer Misconduct legal news India sexual assault Telugu News uttar pradesh crime women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.