Telugu News: Lawrence Bishnoi: పంజాబ్‌ కబడ్డీ ప్లేయర్ని కాల్చి చంపిన బిష్ణోయ్

Read Time:  1 min
Lawrence Bishnoi
Lawrence Bishnoi
FONT SIZE
GET APP

పంజాబ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లుథియానా జిల్లా సమ్రాలా ప్రాంతంలో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్ను(Gurvinder Singh) గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Read Also: Medchal:సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Lawrence Bishnoi
Lawrence Bishnoi

తర్వాత సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ తమ పేరుతో ఓ పోస్టు చేస్తూ, ఈ హత్య తమవేనని ప్రకటించింది. ఆ పోస్టులో కరణ్ మరియు తేజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇటీవల ఈ గ్యాంగ్‌ పేరు పలు అంతర్జాతీయ ఘటనల్లోనూ వినిపించింది. కెనడాలో పారిశ్రామికవేత్త దర్శన్‌సింగ్‌ సహాసిని హత్య చేసిన ఘటనలో కూడా బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్‌ ప్రమేయం ఉందని సోషల్ మీడియా ద్వారా వారు పేర్కొన్నారు. అదేవిధంగా, పంజాబీ గాయకుడు చాని నట్టన్‌ ఇంటి సమీపంలో జరిగిన కాల్పులకూ తమకే సంబంధం ఉందని ప్రకటించారు. ఇలాంటి వరుస హత్యలు పంజాబ్‌ రాష్ట్రంలో ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. పోలీసులు ఈ గ్యాంగ్‌ కార్యకలాపాలను అణచివేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.