📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర టీ20 సిరీస్ టీమిండియాదే ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు టెట్ ‘కీ’ విడుదల

Latest News: Uttar Pradesh Crime లేట్ వయస్సులో ఘాటు ప్రేమ..పెళ్ళికి ఒత్తిడితో ప్రియురాలు హత్య

Author Icon By Anusha
Updated: September 3, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లో ఒక సోషల్ మీడియా పరిచయం చివరకు ప్రాణాంతకంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫిల్టర్లతో తన వయసును దాచిపెట్టి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిన 52 ఏళ్ల మహిళ చివరకు అదే యువకుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీ (Uttar Pradesh) లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్, ఫరూఖాబాద్‌కు చెందిన 52 ఏళ్ల రాణి ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. నలుగురు పిల్లల తల్లి అయిన రాణి, తన నిజమైన వయసు బహిర్గతం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా ఫిల్టర్లను వినియోగిస్తూ యువతిగా కనిపించేది. ఆమె ఫోటోలు చూసి మోసపోయిన అరుణ్, రాణితో చాట్‌లు మొదలుపెట్టాడు. క్రమంగా ఇద్దరి మధ్య సంబంధం గాఢమై, ప్రేమాయణం వరకు వెళ్లింది.

పూర్తి వివరాలు

తర్వాత ప్రత్యక్షంగా కలుసుకుని ఫరూఖాబాద్‌లోని పలు హోటళ్లలో కలుసుకునేవారు. ఈ క్రమంలో రాణి, అరుణ్‌ (Rani, Arun) కు సుమారు రూ.1.5 లక్షలు కూడా ఇచ్చింది.కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అరుణ్‌పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. “ఆగస్టు 10న అరుణ్ ఆమెను మెయిన్‌పురికి పిలిచాడు. పెళ్లి, డబ్బు విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నిందితుడు, ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు” అని నగర పోలీస్ చీఫ్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.

Latest News

తన కుటుంబ సభ్యులకు చెబుతానని

మరుసటి రోజు మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఆమె వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు లేదా తన కుటుంబ సభ్యులకు చెబుతానని రాణి బెదిరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. “వారిద్దరి మధ్య సంభాషణలు, ఫోటోలు ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని జైలుకు తరలించాం” అని పోలీసులు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-landslide-in-sudan-thousands-killed/international/539924/

52 year old woman killed arun rajput Breaking News farukkhabad crime news instagram love affair latest news rani murder social media filters Telugu News up murder case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.