📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: UP Crime News హీరోయిన్ లా కనిపించాలని.. భర్త హింసిస్తున్నాడని ఓ భార్య ఫిర్యాదు

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ ప్రపంచం అంటే చాలా మంది అభిమానులకు మోజు. హీరోలు, హీరోయిన్లు తెరపై ఎలా కనిపిస్తారో, వారు వేసే దుస్తులు, వారి శరీర భంగిమ, వారి స్టైల్ అన్నీ చాలా మందికి ఆకర్షణగా ఉంటాయి. ఈ మోజు కొన్నిసార్లు అతి స్థాయికి చేరుతుంది. తెరపై చూసే ఆ ఆకర్షణ నిజ జీవితంలో కూడా కావాలని ప్రయత్నించే వారు కొందరు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల అందం, గ్లామర్‌కి మగవారు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అలాంటి ఆలోచనలను తమ కుటుంబ జీవితంలోకి తీసుకువచ్చి, భార్యలను వేధించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుని, ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

గ్లామర్‌గా రెడీ కావాలని బలవంతం చేయడం

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి బాలీవుడ్ నటి నోరా ఫతేహి (Bollywood actress Nora Fatehi) పట్ల ప్రత్యేకమైన మోజు పెంచుకున్నాడు. తెరపై ఆమె డ్యాన్స్‌లు, శరీర సౌందర్యం చూసి పూర్తిగా ప్రభావితమయ్యాడు. ఆ మోజు తన భార్య జీవితాన్ని దుర్భరంగా మార్చింది. భార్యను నోరా ఫతేహిలా తయారవ్వాలని, ఆమెలా శరీర ఆకృతిని కలిగి ఉండాలని రోజూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. భార్యను అలాంటి గ్లామర్‌గా రెడీ కావాలని బలవంతం చేయడంతో పాటు, తనకు నచ్చని రూపంలో ఉందని తరచూ విమర్శించేవాడు.ప్రతీ ఒక్కరికీ వారి శరీర నిర్మాణం, స్వభావం వేరు. కానీ ఆ భర్త మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు. తన భార్య తప్పనిసరిగా సినీ హీరోయిన్‌లా కనిపించాలనే పట్టుదలతో ఆమెపై ఒత్తిడి పెంచుతూ వచ్చాడు.

అత్తమామలు తన శారీరక రూపాన్ని ఎగతాళి చేసేవారు

మాటలతోనే కాదు, శారీరకంగా కూడా వేధింపులు (Physical harassment) పెట్టినట్లు సమాచారం. భర్త అతి మోజు భార్య జీవితాన్ని నరకంగా మార్చేసింది.బాధితురాలు ఈ ఏడాది మార్చి 6న మీరట్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్‌ అయిన శివం ఉజ్వల్‌ను వివాహం చేసుకుంది. ఆమె సాధారణ ఎత్తు, రంగు ఉన్నప్పటికీ.. తన భర్త, అత్తమామలు తన శారీరక రూపాన్ని ఎగతాళి చేసేవారు. పెళ్లి తర్వాత తన జీవితం నాశనమైందని, తనకి నోరా ఫతేహి లాంటి అమ్మాయి కావాలంటూ శివం వేధించేవాడు. నోరా ఫతేహిలా కనిపించడానికి.. రోజుకు మూడు గంటలు వ్యాయామం చేయాలని భర్త తనపై ఒత్తిడి చేసేవాడని భార్య తెలిపింది. ఒకవేళ ఏ రోజైనా మూడు గంటలు వ్యాయామం చేయకపోతే, ఆ రోజు ఆహారం ఇవ్వకుండా వేధించేవాడని ఆరోపించింది.

Latest News

గర్భస్రావ మాత్రలు

ఈ వేధింపులే కాకుండా తన భర్త ఇతర మహిళల పట్ల మోజు పడతారని.. సోషల్ మీడియాలో వారి అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు చూసేవాడని ఆ మహిళ ఆరోపించింది. తాను గర్భవతి అయినప్పుడు తన భర్త రహస్యంగా గర్భస్రావ మాత్రలు ఇచ్చాడని ఆరోపించింది. అంతే కాకుండా అదనపు కట్నం కోసం తన అత్తమామలు కూడా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిలో దాదాపు రూ. 76 లక్షలు ఖర్చు చేశామని, ఇందులో రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చామని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్త, మామ,వదినపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న కట్నం వేధింపులుమహిళల పట్ల దారుణమైన ప్రవర్తనకు అద్దం పడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/online-games-online-games-rake-in-rs-20-thousand-crores/crime/533467/

Bollywood actress obsession Breaking News domestic abuse case husband harassment latest news Nora Fatehi Telugu News Uttar Pradesh incident wife complaint

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.