📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Shikhar Dhawan – మనీలాండరింగ్ కేసులో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఈడీ నోటీసులు

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్, ‘గబ్బర్’గా అభిమానులను అలరించిన శిఖర్ ధావన్ ప్రస్తుతం తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతనికి సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ 1xBet (1xBet App) కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ గురువారం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు అందాయి.

1xBet అనే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ భారత్‌లో నిషేధితమైంది. అయినప్పటికీ ఈ ప్లాట్‌ఫామ్ ఆన్‌లైన్ ద్వారా యూజర్లను ఆకర్షిస్తూ, పెద్ద స్థాయిలో అక్రమ డబ్బు లావాదేవీలకు కారణమవుతోందని దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీకి ప్రమోటర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా శిఖర్ ధావన్ వ్యవహరించాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతనిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించనున్నారు.

చట్ట విరుద్దంగా నడుస్తున్న ఈ యాప్స్

గతేడాది ఆగస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్.. క్రికెట్ విశ్లేషకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్‌ (IPL) కు కూడా దూరమైన అతను.. లెజెండ్స్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ కూడా ఆడే అవకాశం ఉంది.బెట్టింగ్ యాప్స్ కేసులో గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ విచారించింది. అలాగే.. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండలను కూడా తెలంగాణ పోలీసులు అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లపై విచారించారు. చట్ట విరుద్దంగా నడుస్తున్న ఈ యాప్స్ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే చట్ట విరుద్దమైన బెట్టింగ్ ఫ్లాట్ ఫామ్స్‌పై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది.

Latest News

శిఖర్ ధావన్ వంటి క్రికెటర్ పేరు

శిఖర్ ధావన్ 1xBet యాప్‌లో సహ యజమానిగా తేలితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం.. 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ అక్రమ యాప్ ద్వారా ధావన్ సంపాదించిన డబ్బు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం ఈ నేరానికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు. ఇంకా నేరం రుజువు కాలేదు.శిఖర్ ధావన్ వంటి క్రికెటర్ పేరు ఒక అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ కేసులో బయటకు రావడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం ఈడీ విచారణ కీలకమైంది. వాస్తవాలు బయటకొచ్చే వరకు ఈ కేసు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.

శిఖర్ ధావన్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

శిఖర్ ధావన్ 1985 డిసెంబర్ 5న ఢిల్లీలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు.

అతని క్రికెట్ కెరీర్ ఎలా ప్రారంభమైంది?

శిఖర్ ధావన్ దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత జట్టులో చోటు సంపాదించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అతని శతకాలు భారత్ విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/bcci-bronco-test-not-mandatory-focus-on-yo-yo-test/sports/540963/

1xBet betting investigation Breaking News ED summons Enforcement Directorate illegal betting IPL cricketer latest news Money Laundering Case Shikhar Dhawan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.