हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Latest News: Crime ప్రియుడి మోజులో భర్తను, కూతురిని హతమార్చిన మహిళ

Anusha
Latest News: Crime ప్రియుడి మోజులో భర్తను, కూతురిని హతమార్చిన మహిళ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District) లోని చిట్యాల మండలం వడితల గ్రామం ఒక భయంకర ఘటనకు కేంద్రబిందువైంది. మానవత్వాన్ని సైతం మరచిపోయి, ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన భర్తను, 22 ఏళ్ల కూతురిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామం అంతటా భయం, ఆగ్రహం వ్యాపించింది.కవిత అనే ఈ మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. భర్త వ్యాధిగ్రస్తుడై మంచానికే పరిమితమవుతున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.

పూర్తి వివరాలు

ఈ సంబంధం బయటపడిపోతుందనే భయంతోనే ఆమె దారుణ చర్యలకు పాల్పడింది. మొదటగా జూన్ 25న భర్తను ప్రియుడి సహకారంతో కవితను చంపేసింది. భర్త సహజ కారణాలతో మరణించినట్టుగా గ్రామస్థులను నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది.ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయకుండా చాకచక్యంగా ముసుగేసింది.వివాహేతర సంబంధం బయటపడుతుందని భావించిన కవిత (Kavitha) మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి వర్షిణిని కడతేర్చింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లింది. అక్కడే ఆమె ఆధార్ కార్డు ఉంచి, ఇది క్షుద్రపూజలో భాగమని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.అయితే పోలీసులు కేసును లోతుగా పరిశీలించగా, కవితపై అనుమానం పెరిగింది.

Latest News
Latest News

పోలీసులు అదుపులోకి

దర్యాప్తు క్రమంలో కవితను కఠినంగా ప్రశ్నించగా, ఆమె అసలు నిజం బయటపెట్టింది. రెండు నెలల క్రితం భర్తను హత్య చేయడం, తాజాగా కూతురిని చంపడం, మరో వ్యక్తిని కూడా హత్య చేయడానికి ప్లాన్ వేయడం అన్నింటినీ ఆమె ఒప్పుకుంది. ఈ విషయాలు తెలిసిన గ్రామస్థులు షాక్‌కు గురైపోయారు.ప్రియుడితో కలిసి ఇలా క్రూరంగా కుటుంబాన్ని నాశనం చేసిన కవితను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సంఘటనతో వడితల గ్రామంలో కన్నీటి వాతావరణం నెలకొంది. కూతురిని కాపాడాల్సిన తల్లే కత్తి పట్టి నరబలి ఇచ్చినట్టుగా హత్య చేయడంతో, ప్రజలు ఆమెను “కసాయి తల్లి”గా అభివర్ణిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-uttar-pradesh-crime-intense-love-at-a-late-age-girlfriend-murdered-under-pressure-to-get-married/crime/540469/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870