📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Crime News ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు..ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన సమాజాన్ని కలిచివేస్తోంది. తల్లి ప్రేమ ఎంత పవిత్రమో మనందరికీ తెలిసిందే. పిల్లల కోసం తల్లి తన ప్రాణాలని పణంగా పెట్టి, ఎక్కువగా కష్టపడుతుంది. తల్లి రక్తమాంసాలను పంచి పెంచి, కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ ఇంతటి అపారమైన తల్లి ప్రేమకు కొందరు సంతానం విలువ ఇవ్వకపోవడం బాధాకరం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మనసును కలచివేస్తోంది.నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తల్లిని బీమా సొమ్ము కోసం హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు

అయితే, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ యువకుడు తల్లిని హత్య చేయాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున (46) అనే మహిళ గత జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఆరు నెలల తర్వాత ఆమె కుమారుడు చాకలి రాజు (28) మరో హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా.. పోలీసులు రాజును ప్రశ్నించగా తన తల్లి మరణానికి సంబంధించిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది.రాజు ప్రవర్తన సరిగా లేదని, అది మార్చుకోవాలని తల్లి జమున (Mother Jamuna) పలుమార్లు అతడిని హెచ్చరించింది. తల్లి మాటలు వినని రాజు, ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు.

Latest News

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు

ఇదే సమయంలో జమున పేరిట వివిధ బీమా సంస్థల్లో సుమారు రూ. 80 లక్షల ప్రమాద బీమా ఉందని తెలుసుకున్న రాజు ఆ డబ్బుపై ఆశ పెంచుకున్నాడు. తల్లి చనిపోతేనే ఆ సొమ్ము దక్కుతుందని భావించిన దుర్మార్గుడు.. జనవరి 9న జమున తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపాడు. అప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు.తాజాగా హత్యాయత్నం కేసు విచారణ సమయంలో రాజు తన తల్లిని తానే బండరాళ్లతో కొట్టి చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు వాంగ్మూలంతో పోలీసులు జమున కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారాయో చూపిస్తోంది. డబ్బు, ఆస్తుల కోసం తల్లిదండ్రులను హత్య చేయడం వంటి నేరాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిఫలంగా ఇలాంటి దారుణాలు చేయడం మానవత్వానికే మచ్చ.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/congress-we-should-celebrate-victory-in-local-body-elections/telangana/533721/

abandoned mothers child future children cruelty mother love protection like eyelid society issues Telugu News true affection

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.