Latest News: Kurnool Tragedy: ట్రావెల్స్ బస్సులో మంటలు.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి?

Read Time:  1 min
Kurnool Bus Accident Video
Kurnool Bus Accident Video
FONT SIZE
GET APP

కర్నూలు (Kurnool crime) జిల్లా లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సును బైక్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఆ బస్సు బెంగళూరు (Bangalore) నుండి హైదరాబాద్ (Hyderabad) వైపు బయలుదేరి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

 Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం

Kurnool Crime
Kurnool

ముందు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.. పలువురికి గాయాలు కాగా వారందరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.