కర్నూలు (Kurnool) జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి.ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ సిరి అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఉండటం అందరినీ కలచివేస్తోంది.
Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు.
ఉపాధి నిమిత్తం బెంగళూరు (Bangalore) లో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, ఘటనకు గల కారణాలను మీడియాకు వివరించారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్
బస్సు కిందకు ఒక బైక్ దూసుకురావడంతో, డోర్ తెరుచుకోవడానికి ఉపయోగపడే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయని, సుమారు 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశామని, మరో 20 మంది క్షేమంగా బయటపడ్డారని ఆమె వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: