📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Kukatpally Crime: హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మాధవరం కృష్ణారావు

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూకట్‌పల్లి లో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (BRS MLA Madhavaram Krishna Rao) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, దోషులకు కఠినమైన శిక్షలు తప్పనిసరిగా విధించాలన్నారు. చిన్నారి ప్రాణం బలిగొన్న ఈ దారుణ ఘటనపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ, నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువైపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ – “నగరం నడిబొడ్డున ఇలా దారుణమైన హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వలేకపోతే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. మియాపూర్‌ (Miyapur) లో పట్టపగలు దొంగతనాలు, కేపీహెచ్‌బీ కాలనీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు జరగడం వంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మరింత ప్రమాదకరంగా

హైదరాబాద్‌లో యువతలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరుగుతోందని, మత్తులో తూగుతున్న వారు రోడ్లపై తిరుగుతూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. “ఈ డ్రగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. యువతకు భయం పెట్టాలి. కఠిన చట్టాలు అమలు చేసి, ఇలాంటి వారికి తక్షణం శిక్షలు విధించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది” అని హెచ్చరించారు.అలాగే, గత పది సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోని 20 నెలల్లో క్రైమ్ పరిస్థితి ఎలా ఉందో పోల్చి చెప్పాలని పోలీసులను సవాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత, శాంతిభద్రతలు బలంగా ఉన్నాయని, అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cybercriminals-are-looting-people-on-the-pretext-of-renting/crime/532044/

Breaking News brs mla madhavaram krishna rao hyderabad law and order kphb attacks kukatpally child murder latest news miyapur thefts rising crime rate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.