📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Kritika Reddy: కృతికా రెడ్డి హత్య కేసు.. ఆదర్శవంతంగా తండ్రి నిర్ణయం

Author Icon By Anusha
Updated: October 16, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులోని ఒక విషాద ఘటన తాజా వార్తల్లో నిలిచింది. డాక్టర్ మహేంద్ర రెడ్డి తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యను సహజ మరణం అని భార్య కుటుంబ సభ్యులను నమ్మింపజేసినట్టు బయటపడింది.

వాస్తవం తెలిసిన తర్వాత, డాక్టర్ కృతికా రెడ్డి (Kritika Reddy) తండ్రి కుప్పకూలిపోయాడు. కేసు దర్యాప్తులో, కృతికా రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఉండటం కారణంగా మహేంద్ర తన భార్యను హత్య చేశాడని తేలింది.

Read Also: Crime: కోనసీమలో దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

ఈక్రమంలో 2024 మే 26వ తేదీన కృతిక, మహేందర్ రెడ్డిల వివాహం జరిగింది.అయితే పెళ్లై సంవత్సరం కూడా కాకముందే.. కృతికా రెడ్డి (Kritika Reddy) హత్యకు గురి కావడం సంచలనం రేపింది.కృతికా రెడ్డికి అజీర్ణం, షుగర్, గ్యాస్ట్రిక్ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. పెళ్లైన తర్వాత దీని గురించి మహేందర్ రెడ్డికి తెలిసింది. కృతికకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తన వద్ద దాచి.. ఆమెని తనకిచ్చి పెళ్లి చేసినందుకు తీవ్రంగా రగిలిపోయిన మహేందర్ రెడ్డి..

ఏకంగా భార్యను హత్య చేయాలని భావించాడు. ఇందుకోసం తన వైద్య వృత్తినే వినియోగించుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉండాగానే అనారోగ్యం కారణంగా కృతికా మారతహళ్లి (Marathahalli) లోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది.దీంతో మహేంద్ర రెడ్డి ఆమెను పరామర్శించడానికి మారతహళ్లికి వెళ్లాడు.

Kritika Reddy

దానిని సహజ మరణంగా చిత్రీకరించడానికి

అక్కడే ఉంటూ కృతికా రెడ్డికి తనే స్వయంగా ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే.. ప్రొపోఫోల్ (Propofol) అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చాడు. ఈక్రమంలో ఈఏడాది అనగా 2025, ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్యం విషయమించింది. శ్వాస తీసుకోలేని స్థితికి చేరింది.

అయితే కృతికా అక్క రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నికితా రెడ్డికి  అనుమానం రావడంతో ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిపోర్టులో కృతికా బాడీలో ప్రొపోఫోల్‌ అనే మత్తుమందు ఉన్నట్లుగా తేలింది. కృతిక మత్తుమందు సమ్మేళనం కారణంగా మరణించిందని నిర్ధారించింది.

తన కుమార్తె ఇంటిని ఇస్కాన్‌కు విరాళంగా

భార్యను హత్య చేశాక మణిపాల్‌కు పరారైన నిందితుడు మహేంద్రను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇప్పటికే లుక్-అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేయబడింది. హత్యను అమలు చేయడానికి మహేంద్ర తన వృత్తిపరమైన OT,  ICU మందులను ఉపయోగించుకున్నాడని, తరువాత దానిని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో కృతికా రెడ్డి తండ్రి మునిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మారతహళ్లిలోని తన కుమార్తె ఇంటిని ఇస్కాన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె జ్ఞాపకాలు ఈ ఇంట్లో చాలా వెంటాడుతున్నాయి.

అందుకే ఈ ఇంటిని ఇస్కాన్ ఆలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తమ పెద్ద కుమార్తె అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నాముని వెల్లడించాడు. కృతికాను హత్య చేసిన మహేంద్రను శిక్షించాలని, ఇలాంటి సంఘటన ఏ స్త్రీకీ జరగకూడదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bangalore Breaking News Dr Mahendra Reddy ISKCON donation Kritika Reddy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.