Koti firing case: హైదరాబాద్‌లోని కోఠిలో జరిగిన సంచలనాత్మక దోపిడీ కేసులో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. ఎస్‌బీఐ ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలు దోచుకున్న ముఠా సభ్యుడిని హర్యానాలో పట్టుకున్నారు.
Read Also: Anakapalli: మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం
మూడు నెలలుగా రెక్కీ
దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. వ్యాపారి రిన్షద్‌పై కాల్పులు జరిపేందుకు వారు గత మూడు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటూ నిఘా (రెక్కీ) నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల వేట.. ఇద్దరు అదుపులో
ప్రధాన నిందితుడిని హర్యానాలో అరెస్ట్(arrest) చేయగా, మరో నిందితుడి కోసం యూపీ, హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ముఠాకు స్థానికంగా సహకరించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: