📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Monojit Mishra: సౌత్ కలకత్తా లా కాలేజీ అత్యాచార కేసు: దర్యాప్తు ముమ్మరం

Author Icon By Shobha Rani
Updated: July 4, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (Monojit Mishra)సహా నలుగురిని ఈ తెల్లవారుజామున కాలేజీకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ఘటన జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఉదయం 4:30కి ప్రారంభమైన ప్రక్రియ
ఉదయం 4:30 గంటల సమయంలో నిందితులు మోనోజిత్ మిశ్రా (Monojit Mishra), విద్యార్థులు ప్రమిత్ ముఖర్జీ (Pramit Mukherjee), జైబ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ (Pinaki Banerjee)లను భారీ బందోబస్తు మధ్య కస్బా ప్రాంతంలోని లా కాలేజీకి తరలించారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ కొనసాగిందని, దీని ద్వారా కీలక ఆధారాలు సేకరించినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ లభించిన వివరాలను బాధితురాలి వాంగ్మూలం, ఇతర సాక్ష్యాధారాలతో సరిపోల్చి చూస్తామని ఆయన వివరించారు.

సౌత్ కలకత్తా లా కాలేజీ అత్యాచార కేసు: దర్యాప్తు ముమ్మరం

నిందితుడి నేరచరిత్ర: మోనోజిత్ మిశ్రా
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రా (Monojit Mishra)గతంలో అదే కాలేజీ పూర్వ విద్యార్థి అని, ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తేలింది. క్యాంపస్‌లో విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసేవాడని బాధితురాలు ఆరోపించారు. “అమ్మాయిల ఫోటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపేవాడు. లైంగికంగా వేధించేవాడు. అతడి భయంతో విద్యార్థులు క్లాసులకు రావడానికే జంకే వారని” ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపారు.
మునుపటి కేసులు
పోలీసుల రికార్డుల ప్రకారం మోనోజిత్ మిశ్రాపై మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులకు సంబంధించి ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. గతంలో ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా తేలడంతో 2013లో అతడిని ఇదే కాలేజీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ, అతనికి కాలేజీలో ఉద్యోగం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి
ఈ ఘటన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం నిందితుడిని గత చరిత్ర తెలిసి కూడా ఉద్యోగంలో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు రావడంతో మోనోజిత్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. కోర్టు ఆదేశాల మేరకు మిశ్రాతో పాటు ఇద్దరు విద్యార్థులకు జులై 8 వరకు, సెక్యూరిటీ గార్డుకు శుక్రవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Diogo Jota: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ప్లేయర్

Breaking News in Telugu crime scene reconstruction Google news Google News in Telugu Kolkata Law College rape case Latest News in Telugu law student rape Kolkata Manojit Mishra criminal record Manojit Mishra news Manojit rape case update Paper Telugu News South Kolkata crime news student harassment college Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news West Bengal law college crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.