📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Kolkata: కోల్‌కతా గ్యాంగ్ రేప్.. వైద్య నివేదికలో విస్తుపోయే నిజాలు!

Author Icon By Shobha Rani
Updated: June 28, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే ప్రధాన నిందితుడు, అధికార టీఎంసీ (TMC)విద్యార్థి విభాగం నేత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
నివేదికలో వాస్తవాలు
బాధిత విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు రిపోర్టులో తేలింది. “బాధితురాలి మెడ, ఛాతీ భాగాలపై పదునైన పంటి గాట్లు ఉన్నాయి. గోళ్లతో రక్కిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా తీవ్రంగా గాయపరిచారు” అని ఓ సీనియర్ పోలీసు (Police) అధికారి మీడియాకు వివరించారు. ఈ నెల 25న కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్‌కతా లా కళాశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
సెక్యూరిటీ గదిలో బంధించి దాడి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి లాక్కెళ్లి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ప్రయత్నించగా, హాకీ స్టిక్‌తో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని బయటకు చెబితే, ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని ప్రధాన నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది.
రాజకీయంగా హాట్ టాపిక్.. మోనోజిత్‌పై తీవ్ర ఆరోపణలు
ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (31) (Monojit misra) అదే కళాశాల పూర్వ విద్యార్థి. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తూ, అదే కాలేజీలో ఒప్పంద అధ్యాపకుడిగా కూడా కొనసాగుతున్నాడు. అతనికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) (TMC) పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్‌కతా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో

Kolkata: కోల్‌కతా గ్యాంగ్ రేప్.. వైద్య నివేదికలో విస్తుపోయే నిజాలు!

మిశ్రా(Monojit misra) తో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులను, వారికి సహకరించిన కాలేజీ సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
కేసు దర్యాప్తులో ప్రగతి
ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులు అరెస్టు అయ్యారు. బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదిక, సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు సేకరించబడుతున్నాయి. పోలీసులు IPC సెక్షన్లు 376 (డీ), 354, 506, 325 కింద కేసు నమోదు చేశారు.
కళాశాలల్లో మహిళల రక్షణ ఎక్కడ?
ఈ ఘటన విద్యాసంస్థల భద్రతా చర్యలపై తీవ్ర సందేహాలు పెంచింది. కళాశాల పరిధిలో, సెక్యూరిటీ గార్డు సహకారంతో ఇలా జరిగిందంటే, ఇది రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత గురించి ఆందోళనకర పరిస్థితి అని విమర్శకులు పేర్కొంటున్నారు.

Read Also: Takahiro Shiraishi: ‘ట్విట్టర్ కిల్లర్’ కేసుకు తెరపటం.. నిందితుడికి

CampusRape Google news JusticeForSurvivor Kolkata gang rape.. Paper Telugu News Shocking facts in the medical report! Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.