ఖమ్మం జిల్లా(Khammam crime) కొత్తగూడెం(Kothagudem) ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19) హైదరాబాద్ నగరంలోని నాగోలు సమీప తట్టిఅన్నారం ప్రాంతంలో నివసిస్తోంది. అదే సమయంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మహేశ్ అలియాస్ ఆనంద్ (23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల సమ్మతితో వివాహానికి కూడా సిద్ధమయ్యారు.
Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనుమానం చిచ్చుపెట్టింది
అయితే ఇటీవల ఐశ్వర్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఆనంద్ అనుమానాలకు లోనయ్యాడు. ఈ అనుమానాలే ఇద్దరి మధ్య విభేదాలకు దారితీశాయి. ఈ నెల 5వ తేదీన తట్టిఅన్నారం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ గొడవ అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఐశ్వర్య, అదే వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: