📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Kerala: గృహ హింసకు బలి అయిన గర్భిణీ

Author Icon By Anusha
Updated: July 31, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల పై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.ప్రస్తుతం మహిళలు ప్రశాంతంగా, జీవించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కేరళ లోని త్రిశూర్‌ (Thrissur) లో గర్భిణీ ఫసీలా గృహ హింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్ల అరెస్టు అయ్యారు. ఫసీలా తన తల్లికి పంపిన సందేశాలలో తన భర్త, అత్తల ద్వారా ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వివరించింది. ఇదే విధంగా కొల్లంలో అతుల్య అనే మహిళ కట్నం కోసం వేధింపులకు గురై యుఏఈలో మృతి చెందింది.వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేను చనిపోతున్నాను అంటూ ఓ గర్భిణి తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కేరళ (Kerala) లోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. ఫసీలా అనే మహిళ త్రిసూర్ జిల్లాలోని వెల్లంగులర్‌లోని తన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జూలై 29న జరిగింది. ఇరింజలకుడ పోలీసులు ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్లను అరెస్టు చేశారు.

Kerala: గృహ హింసకు బలి అయిన గర్భిణీ

నేను చనిపోతున్నానంటూ

ఇద్దరినీ బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మెట్టినింట్లో తాను నిత్యం నరకంఅనుభవిస్తున్నానని,ప్రతిరోజూ తనపై దాడి చేస్తున్నారని ఆమె తన తల్లికి మేసేజ్‌లు కూడా పంపింది.ఫసీలా తన తల్లికి పంపిన మేసేజ్‌లలో తాను రెండవసారి గర్భవతినని, తన భర్త తన కడుపులో చాలాసార్లు తన్నాడని చెప్పింది. వీళ్లు నన్ను చంపేసేలా ఉన్నారని, అందుకే నేను చనిపోతున్నానంటూ ఆ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇతర సంబంధిత విభాగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

త్రిసూర్ ప్రత్యేకత?

త్రిసూర్ కేరళ సాంస్కృతిక రాజధానిగా, పూరమ్స్ భూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా పురాతన దేవాలయాలు, చర్చిలు మరియు మసీదులకు ప్రసిద్ధి చెందింది.

కేరళ సాంస్కృతిక నగరం ఏది?

త్రిసూర్ నగరం వేడుకల నగరంగా పిలువబడుతుంది. చరిత్ర అంతటా దాని సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు మతపరమైన మొగ్గు కారణంగా కేరళ సాంస్కృతిక రాజధానిగా కూడా పిలువబడుతుంది. నగర కేంద్రంలో కేరళ సంగీత నాటక అకాడమీ, కేరళ లలితకళా అకాడమీ మరియు కేరళ సాహిత్య అకాడమీ ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Read Also: AIADMK: ఎన్‌డీఏ నుండి వైదొలిగిన అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల కమిటీ

Breaking News domestic violence Kerala Fasila death case Kerala Crime News latest news pregnant woman suicide Kerala Telugu News women harassment India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.